chanakya niti: కుటుంబంలో అతని పాత్ర కీలకం... అతనే తప్పుడు దారిలో నడిస్తే...
ABN , First Publish Date - 2023-01-07T06:49:32+05:30 IST
కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో ఇంటి యజమాని పాత్ర ఎంతో ముఖ్యమైనది. కుటుంబంలో అధిపతి స్థానం చాలా ముఖ్యమైనదని చాణక్యుడు చెప్పాడు.
కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో ఇంటి యజమాని పాత్ర ఎంతో ముఖ్యమైనది. కుటుంబంలో అధిపతి స్థానం చాలా ముఖ్యమైనదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అతని నిర్ణయం కుటుంబం భవిష్యత్తును బాగు చేయగలదు లేదా పాడు చేయగలదు. ఇంటి పెద్దకు ఈ 3 అలవాట్లు ఉంటే అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదని చాణక్యుడు తెలిపాడు.
చూసేదాన్నే నమ్మండి
ఇంటి యజమానిని ఇంటిలోనివారంతా నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో అతను ఎప్పుడూ నాకు ఏదీ పట్టదు అనే విధంగా వ్యవహరించకూడదు. ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే కేవలం చెప్పుడు మాటలను నమ్మితే కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చెప్పుడు మాటల కారణంగా మోసపోయేందుకు అవకాశాలు అధికం. అందుకే మనస్సాక్షితో, అవగాహనతో పని చేసే కుటుంబ పెద్ద కారణంగా కుటుంబ ఐక్యత ఎప్పటికీ చెదిరిపోదు.
డబ్బు నిర్వహణ
ఇంటి పెద్దలు డబ్బును సక్రమపద్ధతిలో ఉపయోగిస్తే, అనవసరమైన ఖర్చులకు అడ్డుకట్ట పెడుతుంది. కష్టాల్లో కూడా అతని కుటుంబం అర్థం చేసుకుని ఐక్యంగా ఉంటుంది. అలాంటి కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి కొరత ఏర్పడదు. డబ్బును సక్రమంగా వినియోగించే అలవాటు వల్ల కుటుంబంలోని సంతోషం ఆపద సమయంలో కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది.
దృఢంగా నిలబడండి
ఇంటి పెద్ద క్యూలో నిల్చున్న మొదటి వ్యక్తి లాంటి వారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఒకరు సక్రమంగా నిలబడితే, క్యూలోని మిగిలిన వారు కూడా అతనిని అనుసరిస్తూ అలాగే నిలబడతారు. మంచి పనులు చేయాలనే ఇంటి పెద్దల స్ఫూర్తి, ఆలోచించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లాంటి లక్షణాలను ఇంటిలోని ఇతరులు కూడా అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటు కారణంగా కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య క్రమశిక్షణను కొనసాగాలంటే ఇంటి పెద్ద తన మంచి నిర్ణయాలపై దృఢంగా ఉండటం ఎంతో అవసరం అని చాణక్య తెలిపారు.