Share News

El Salvador: తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు వెయ్యి డాలర్ల పన్ను విధిస్తున్న ఎల్ సాల్వడార్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-10-27T14:20:51+05:30 IST

ఎల్ సాల్వడార్(El Salvador) అనే దేశం తమ దగ్గరకు వచ్చే విదేశీ ప్రయాణికులకు(Foreign Passengers) పన్ను విధిస్తోంది. ఇండియా, ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై వెయ్యి డాలర్ల ట్యాక్స్(Tax) వేస్తోంది. సేకరించిన డబ్బుతో ఆ దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుగుపరచాలని ప్రణాళికలు రచిస్తోంది.

El Salvador: తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు వెయ్యి డాలర్ల పన్ను విధిస్తున్న ఎల్ సాల్వడార్.. ఎందుకో తెలుసా?

ఎల్ సాల్వడార్: ఎల్ సాల్వడార్(El Salvador) అనే దేశం తమ దగ్గరకు వచ్చే విదేశీ ప్రయాణికులకు(Foreign Passengers) పన్ను విధిస్తోంది. ఇండియా, ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై వెయ్యి డాలర్ల ట్యాక్స్(Tax) వేస్తోంది. సేకరించిన డబ్బుతో ఆ దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుగుపరచాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత్‌తోపాటు 50 కంటే ఎక్కువ ఆఫ్రికన్ దేశాల ప్రజలు పాస్‌పోర్ట్‌పై తమ వద్దకు వస్తే తప్పకుండా నిర్దేశిత రుసుం చెల్లించాలని ఎల్ సాల్వడార్ పోర్ట్ అథారిటీ అక్టోబర్ 20న తెలిపింది. తద్వారా సెంట్రల్ అమెరికా నుంచి వలసలను అరికట్టాలని భావిస్తోంది.


ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ బుకెలే ఈ వారంలో US అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రియాన్ నికోల్స్‌ను కలిశారు. పలు అంశాలతోపాటు దేశానికి వచ్చే వలసల్ని తగ్గించే అంశంపై ఇరువురు చర్చించారు. ఆ దేశానికి ఒక్క సెప్టెంబర్ లోనే 3.2 మిలియన్ల జనాభా వలస వచ్చారు. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుండి చాలా మంది వలసదారులు సెంట్రల్ అమెరికా(America) మీదుగా USకి చేరుకుంటారు. తాజా నిర్ణయంతో ఆఫ్రికా, భారత్ లోని 57 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సమాచారాన్ని విమానయాన సంస్థలు ప్రతిరోజూ సాల్వడోరన్ అధికారులకు తెలియజేయవలసి ఉంటుంది. ఎల్ సాల్వడార్‌కు వచ్చే ముందే తప్పనిసరిగా నిర్దేశిత రుసుము చెల్లించాలి.

Updated Date - 2023-10-27T14:22:05+05:30 IST