Share News

Viral Video: ఈ కుక్క టాలెంట్ చూస్తే షాకైపోవాల్సిందే..!

ABN , First Publish Date - 2023-12-10T21:51:35+05:30 IST

నీళ్లతో ఉన్న గ్లాసును తన తలమీద జాగ్రత్తగా మోస్తూ ముందుకు నడుస్తున్న ఓ కుక్క వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఈ కుక్క టాలెంట్ చూస్తే షాకైపోవాల్సిందే..!

ఇంటర్నెట్ డెస్క్: విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్కలకు టాలెంట్‌ కూడా ఎక్కువే. తమ యజమానుల మనసెరిగి అవి ప్రవర్తించగలవు. మనుషులు చెప్పేవి ఓపిగ్గా చేర్చుకుని ఆ తరువాత వాటిని యథాతథంగా అమలు చేయగలవు. ఇక మనుషుల ప్రాణాలు రక్షించేందుకు కుక్కలు తమ ప్రాణాలనే పణంగా పెట్టిన ఉదంతాలు కోకొల్లలు. అయితే, ఒక్కోసారి కుక్కలు చేసే అల్లరి తెగ ముచ్చటగొలుపుతుంది. వాటి నీడ చూసి అవే బెదిరిపోవడాలు, తమ తోకను పట్టుకునేందుకు తమ చుట్టూ తామే తిరగడాలు.. వంటి వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న వీడియో (Viral video) జనాలను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది.


వీడియోలో ఓ కుక్క నిండుగా నీళ్లున్న గ్లాసును తన నెత్తిమీద పెట్టుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు నడిచింది (Dog steadily holds water filled glass on its head while walking). వీడియో కొద్ది క్షణాల పాటు మాత్రమే ఉన్నా జనాలు మాత్రం వీడియో చూసి షాకైపోతున్నారు. మనిషికి కూడా కష్టతరంగా ఉండే ఈ స్టంట్‌ను ఓ కుక్క అలా ఒడుపుగా చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.


@everythingaboutnepal అనే ఇన్‌స్టా అకౌంట్‌లో తొలిసారిగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఈ వీడియో నెట్టింట కాలు పెట్టగా కేవలం రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక జనాల కామెంట్లకైతే అంతేలేకుండా పోయింది. కుక్క నేర్పరితనం కొందరికి నచ్చితే మరికొందరేమో కుక్కకు ట్రెయినింగ్ ఇచ్చిన వారిని మెచ్చుకుంటున్నారు. ఆ ట్రెయినర్‌కు గొప్ప టాలెంట్ ఉండి ఉంటుందని కామెంట్ చేశారు. జనాలకు ఈ వీడియో బాగా నచ్చడంతో కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చి పడుతున్నాయి.

Updated Date - 2023-12-10T21:54:55+05:30 IST