సన్ గ్లాసెస్, గాగుల్స్... ఒకటేనని అనుకుంటున్నారా? అయితే వీటిలో ఇన్ని తేడాలున్నాయని తెలిస్తే...

ABN , First Publish Date - 2023-05-03T12:34:44+05:30 IST

సన్ గ్లాసెస్, గాగుల్స్... వీటిని మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. అయితే ఈ రెండూ ఒకటేనా? వీటి మధ్య తేడా ఏమైనా ఉందా అనే విషయం మీకు తెలియకపోయి ఉండవచ్చు.

సన్ గ్లాసెస్, గాగుల్స్... ఒకటేనని అనుకుంటున్నారా? అయితే వీటిలో ఇన్ని తేడాలున్నాయని తెలిస్తే...

సన్ గ్లాసెస్, గాగుల్స్... వీటిని మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. అయితే ఈ రెండూ ఒకటేనా? వీటి మధ్య తేడా ఏమైనా ఉందా అనే విషయం మీకు తెలియకపోయి ఉండవచ్చు. అందుకే రండి ఆ వివరాలు తెలుసుకుందాం.

సన్ గ్లాసెస్‌ను(Sunglasses) ఎవరైనా ఉపయోగించవచ్చు. ఇవి సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల(Ultraviolet rays) నుంచి మన కళ్లకు రక్షణ కల్పిస్తాయి. అలాగే ఇవి దుమ్ము, ధూళి నుండి కళ్లను రక్షిస్తాయి. సన్ గ్లాసెస్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటాయి. వాటి లెన్స్‌లు వివిధ రంగులలో లభిస్తాయి.

కొన్ని సన్ గ్లాసెస్ UV కిరణాల నుండి రక్షణ(protection) కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. కొన్ని సన్ గ్లాసెస్ పోలరైజ్డ్, నాన్-పోలరైజ్డ్(Non-polarized) అయి ఉంటాయి. అంటే సూర్యుని కిరణాలు వాటి లెన్స్‌తో ఢీకొని పరావర్తనం చెందుతాయి. సన్ గ్లాసెస్‌తో పోలిస్తే గాగుల్స్ కళ్లకు(eyes) మరింత రక్షణ కల్పిస్తాయి. అవి కళ్ళను పూర్తిగా కప్పివేస్తాయి, ఫలితంగా బాహ్య వస్తువుల నుండి కళ్ళు దెబ్బతినే అవకాశాలు చాలావరకూ తగ్గుతాయి. దీనికి పేటెంట్ 1916లో లభించింది. సి.పి. ట్రోప్మాన్(C.P. Tropman) దీనిని రూపొందించారు.

కాగా ప్రయోగశాలలో కళ్ళకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకంగా గాగుల్స్(Goggles) ఉపయోగిస్తారు. ఈత సమయంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. సన్ గ్లాసెస్ ప్రకాశవంతమైన కాంతి లేదా సూర్యకాంతి నుండి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి. గాగుల్స్ నీరు, దుమ్ము, మంచు మొదలైనవాటి నుండి కళ్ళను రక్షిస్తాయి. సన్ గ్లాసెస్ బరువు(weight) తక్కువగా ఉంటుంది. గాగుల్స్ వాటి కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.

Updated Date - 2023-05-03T12:41:30+05:30 IST