Deepika Padukone: విమానంలో దీపిక చేసిన పనికి.. రెండుగా విడిపోయి కొట్టుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-02-17T11:20:59+05:30 IST

మన దేశంలో సినీ ప్రముఖులకి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Deepika Padukone: విమానంలో దీపిక చేసిన పనికి.. రెండుగా విడిపోయి కొట్టుకుంటున్న నెటిజన్లు
Deepika Padukone

మన దేశంలో సినీ ప్రముఖులకి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి సంబంధించిన ప్రతి విషయం చాలా త్వరగా వైరల్ అవుతూ ఉంటుంది. వారు ఏం చేసిన దాని గురించి ఏదో విధంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే (Deepika Padukone) చేసిన ఓ పనికి సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొందరూ ఆమెకి సపోర్టుగా మాట్లాడుతుండగా.. మరికొందరూ మాత్రం ఆమెపై విమర్శలు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజాగా దీపికా ఓ విమానంలో ప్రయాణం చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో దీపికా అందులోని సాధారణ ప్రజలు ప్రయాణం చేసే ఎకానమీ క్లాస్‌లో కనిపించింది. ఈ భామ బాత్రూమ్‌ ఉపయోగించడానికి వెళుతున్న క్రమంలో.. ఓ ప్రయాణికుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ (Viral Video) అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

deepika1.jpg

‘అంత పెద్ద నటి అయినప్పటికీ ఎంత అణకువ’.. ‘అంత సాధారణంగా ఉన్న దీపికని నిజంగా మెచ్చుకోవాలి’ అంటూ కొందరూ ప్రశంసిస్తున్నారు. అయితే.. మరికొందరూ మాత్రం ‘అది పబ్లిసిటీ కోసం అలా చేసింది’.. ‘ఆ విమానంలో బిజినెస్‌ క్లాస్ అనేదే లేదు. అందుకే అలా ప్రయాణిస్తోంది’.. ‘బిజినెస్ క్లాస్ టిక్కెట్ల కోసం స్పాన్సర్ దొరకలేదేమో’.. ‘అది అణకువ కాదు.. డబ్బులు మిగుల్చుకుంటోంది’ అని మరికొందరూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇంకొందరైతే.. ‘వారు బిజినెస్ క్లాస్ లేదా ఎకానమీ క్లాస్ ఎందులో వెళితే మీకేందుకు. ఎందుకు కొట్టుకుంటున్నారు’ రాసుకొస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kiara Advani Pregnant: ముందు ప్రెగ్నెన్సీ.. తర్వాత పెళ్లి.. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారని సెటైర్లు వేసిన కేఆర్కే

Updated Date - 2023-02-17T11:21:01+05:30 IST