Viral Video: పశువులు మనుషుల మాటలను వింటాయా..? చెప్పంది చేస్తాయా..? ఈ ఆవుల వీడియోను చూస్తే..!
ABN , First Publish Date - 2023-09-11T21:22:42+05:30 IST
ఓ వ్యక్తి ఆగు అని అరవగానే ఆవుల మంది ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టాప్ అంటే.. రోడ్డు మీద వాహనాలు ఆగిపోతాయ్! మనుషులు కూడా ఆగిపోతారు. మరి జంతువులు ఆగుతాయా? పశువుల కాపరి చేసే సూచనలకు సంవత్సరాల తరబడి అలవాటు పడ్డ సందర్భాల్లో పశువులు వాళ్లు చెబితే విన్నా ఆశ్చర్యపోనవసరం లేదు కానీ ఎవరో వ్యక్తి స్టాప్ అనగానే ఏకంగా పశువుల మంద మొత్తం ఆగిపోవడాన్ని ఏమనుకోవాలి? వినడానికే వింతగా ఉన్న ఈ ఘటన ఇటీవలే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
ఇటీవల ఓ వ్యక్తి సైక్లింగ్ చేస్తూ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సైకిల్ రోడ్డు పక్కన ఆపిన అతడు తన కెమెరాలో బ్యాటరీలు మార్చి ఆ తరువాత స్నాక్ తినడం ప్రారంభించాడు. ఇంతలో ఓ ఆవుల మంద అతడివైపు వస్తూ కనిపించింది. ఆ మరుక్షణమే ఓ రైతు అతడివైపు పరిగెత్తుకుని వస్తూ ఆవుల మందను ఆపమన్నాడు. దీంతో, ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపటి తరువాత వాహనాల్ని ఆపినట్టు చేయి ముందుకు చాచి ఆవుల మందవైపు స్టాప్ అని అరిచాడు.
అతడు స్టాప్ అనగానే ఆవులు ఆగిపోయాయి(Cows stop after man asked them to do so). దీంతో, ఏం జరుగుతోందో ఆ వ్యక్తికి కూడా అర్థంకాలేదు. ఆ తరువాత రైతు వచ్చి వాటిని తన పొలంలోకి తోలుకుపోయారు. ఇదంతా వీడియోలో చిత్రీకరించిన వ్యక్తి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.