హిందూధర్మం తెలిపిన 14 రత్నాలలో శంఖం ఒకటి. దీని శక్తి ఎంతటిదో తెలుసుకుంటే...

ABN , First Publish Date - 2023-02-06T09:16:23+05:30 IST

శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచడం, పూజించడపై హిందూధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

హిందూధర్మం తెలిపిన 14 రత్నాలలో శంఖం ఒకటి. దీని శక్తి ఎంతటిదో తెలుసుకుంటే...

శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచడం, పూజించడపై హిందూధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే మత విశ్వాసాల ప్రకారం సముద్ర మథనం సమయంలో వెలువడిన 14 రత్నాలలో శంఖం ఒకటి. హిందువులు జరిపే ఏదైనా శుభకార్యాలలో శంఖం ఊదడం అనేది సంప్రదాయంగా వస్తోంది. అదే సమయంలో వాస్తు శాస్త్రంలో శంఖ ధ్వని చాలా సానుకూలమైనదిగా పరిగణిస్తారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజించి, ఊదడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సానుకూల శక్తి

వాస్తు శాస్త్రం ప్రకారం రోజూ శంఖం ఊదడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఓంకార శబ్దం శంఖం ధ్వని నుండి వెలువడుతుంది. దీని కారణంగా సానుకూల శక్తి ప్రభావం వాతావరణంలో చేరుతుంది. శంఖం ధ్వని కారణంగా ప్రతికూల శక్తి వెంటనే నాశనం అవుతుంది. ఇంట్లోని ప్రతి మూలలో శంఖు జలాన్ని చల్లడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి అంతమవుతుంది. దీంతో పాటు తరచూ గొడవలు జరిగే ఇళ్లలో శంఖం ఊదడం వల్ల కుటుంబంలోని వారి మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి.

వాస్తు దోషాల తొలగింపు

వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషం ఉన్న ఇళ్లలో శంఖం ఊదడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఆర్థిక స్థితి మెరుగుదలకు..

పౌరాణిక విశ్వాసాల ప్రకారం శంఖం, లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి ఉద్భవించాయి. ఈ విధంగా చూస్తే శంఖం, లక్ష్మిదేవి తోడబుట్టినవారవుతారు. దీనితోపాటు విష్ణువుకు శంఖం చాలా ప్రియమైనది, ఇది ఎల్లప్పుడూ విష్ణువు చేతిలో ఉంటుంది. శంఖం ఉండే ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీ దేవి నివాసం ఏర్పరుచుకుంటుందంటారు. ఇంట్లో శంఖం ఉంచడం కారణంగా కుటుంబ సభ్యులందరికీ అదృష్టం కలసివస్తుందంటారు. మరోవైపు శంఖం ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ శంఖాన్ని ఊదడం వల్ల ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శంఖాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

Updated Date - 2023-02-06T09:16:25+05:30 IST