WaltairVeerayya: లాభాల్లో చిరంజీవి సినిమా, మెగా హిట్

ABN , First Publish Date - 2023-01-20T16:13:22+05:30 IST

రంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' (#WalterVeerayya) బాక్స్ ఆఫీస్ (Box-Office) ని ఇంకా కుదిపేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న విడుదల అయిన ఈ సినిమా వారం రోజుల్లోనే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలను తెచ్చిపెడుతోంది. (

WaltairVeerayya: లాభాల్లో చిరంజీవి సినిమా, మెగా హిట్

చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' (#WalterVeerayya) బాక్స్ ఆఫీస్ (Box-Office) ని ఇంకా కుదిపేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న విడుదల అయిన ఈ సినిమా వారం రోజుల్లోనే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలను తెచ్చిపెడుతోంది. (In the first week itself, #WaltairVeerayya is into profits) చిరంజీవి స్టామినా అంటే ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించారు. ఇందులో ఒక పాత చిరంజీవి (VintageChiranjeevi) ని చూసిన అభిమానులు, అతన్ని చూడటం కోసమే మళ్ళీ మళ్ళీ ఈ సినిమాకి వెళుతున్నారని తెలిసింది. ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 167 కోట్ల గ్రాస్ (It collected 167 Crore gross) వసూల్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. అంటే ఈ సినిమా ఇంచుమించు 97 కోట్ల షేర్ వచ్చిందని అంచనా వేస్తున్నారు. (It shows the stamina of Chiranjeevi) అంటే ఈ సినిమా ఇప్పటికే లాభాల్లో వుంది అని అర్థం. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బలంగా వుంది 'వాల్తేరు వీరయ్య'. 'సైరా' (SyeRaa) తరువాత వచ్చిన చిరంజీవి సినిమాలు అన్నిటిలో వారం రోజుల్లో ఇంత అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమాగా ఇది చెప్పొచ్చు.

chiru-new3.jpg

అలాగే ఈ సినిమా ఎన్నో స్థానం లో ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని అది లాంగ్ రన్ లో తెలుస్తుందని, అప్పుడు కరెక్ట్ ఫిగర్స్ వచ్చాక, ఈ సినిమా ఎన్నో స్థానం లో ఉందొ చెప్పొచ్చు అని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. బాబీ కొల్లి (Director Bobby Kolli) ఈ సినిమాకి దర్శకుడు, అతను చిరంజీవి కి వీర అభిమాని కూడా. అతను చిరంజీవిని ఎలా చూపిస్తే అభిమానులు ఆనంద పడతారో అలాగే ఈ సినిమాలో చూపించాడు. కథ అంత పెద్దగా లేకపోయినా, చిరంజీవిని చూపించే విధానం, అలాగే రెండో సగం లో రవితేజ (#RaviTeja) ఎంట్రీ, అతను ఉన్నంత సేపు వున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి అని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నైజాం లో చిరంజీవి మరోసారి తన సత్తా ఏంటో చాటారు. (NIzam king Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య' నైజాంలో తొలి వారం రోజుల్లో సుమారుగా 26 కోట్ల (Rs 26 crore share in Nizam) షేర్ వసూలు చేసింది. ఇంకా ఓవర్ సీస్ (Overseas) లో అయితే ఈ సినిమా ఎప్పుడూ లాభాల బాటన పడింది. సంక్రాంతి కి విడుదల అయిన సినిమాల్లో 'వాల్తేరు వీరయ్య' ని ఎప్పుడో విన్నర్ గా ప్రకటించారు. (#SankranthiWinner)

Updated Date - 2023-01-20T16:13:24+05:30 IST