Chiranjeevi: కండీషన్‌ అప్లై... పూరీ ఏం చేస్తాడో!

ABN , First Publish Date - 2023-02-17T18:25:20+05:30 IST

‘లైగర్‌’ సినిమా ఘోర పరాజయంతో కాస్త సైలెంట్‌గా ఉన్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. అయితే తదుపరి ప్రాజెక్ట్‌ కోసం చేయాల్సిన కసరత్తులు చేస్తూనే ఉంటారాయన. బాలీవుడ్‌లో పూరి ఓ సినిమా చేయాలనుకున్నారు.

Chiranjeevi: కండీషన్‌ అప్లై... పూరీ ఏం చేస్తాడో!

‘లైగర్‌’ సినిమా ఘోర పరాజయంతో కాస్త సైలెంట్‌గా ఉన్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. అయితే తదుపరి ప్రాజెక్ట్‌ కోసం చేయాల్సిన కసరత్తులు చేస్తూనే ఉంటారాయన. బాలీవుడ్‌లో పూరి ఓ సినిమా చేయాలనుకున్నారు. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇద్దరు హీరోలను పూరి కలిసినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే చిరంజీవితో ఓ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్‌ కోసం ‘ఆటో జానీ’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ కథ అనుకున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. చిరంజీవి మాత్రం చక్కని తీసుకొస్తే పూరితో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు.

‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో తన మాస్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్‌. అదే ధైర్యంతో పూరి జగన్నాథ్‌ చిరు కోసం ఓ మాస్‌ కథ రాశారు. చిరంజీవి కూడా అతనితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే మెగాస్టార్‌ ఓ కండీషన్‌ పెట్టారట. నెల రోజుల్లో పూర్తి స్ర్కిప్టుతో రావాలని చిరు సూచించాడట. అంతే కాకుండా 30 రోజులుల కాల్షీటులోనే సినిమా పూర్తి చేయాలని రెండో కండీషన్‌ పెట్టారట చిరంజీవి. ప్రస్తుతం ఆయన భోళా శంకర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటే చిరు సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-02-17T18:25:22+05:30 IST