నకిలీ నోట్ల కేసులో ఓ వ్యక్తి అరెస్ట్.. మెషీన్ కోసం పోలీసులు వెళ్తే అతడి ఇల్లంతా భరించలేనంత పాడు వాసన.. చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-03-06T18:34:20+05:30 IST

పోలీసుల సోదాల్లో షాకింగ్ దృశ్యం వెలుగులోకి..

నకిలీ నోట్ల కేసులో ఓ వ్యక్తి అరెస్ట్.. మెషీన్ కోసం పోలీసులు వెళ్తే అతడి ఇల్లంతా భరించలేనంత పాడు వాసన.. చివరకు షాకింగ్ సీన్..!

ఇంటర్నెట్ డెస్క్: నకిలీ నోట్ల దందా నడుస్తోందన్న సమాచారంపై పోలీసులు ప్రింటింగ్ మెషీన్ కోసం ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. వారు ఊహించినట్టుగానే అక్కడ నకిలీ నోట్ల కట్టలు, ఇతర యంత్రాలు కనిపించాయి. అయితే.. అక్కడ భరించలేనంత పాడు వాసన వస్తుండటంతో పోలీసులు ఇల్లంతా జల్లెడపట్టారు. వారి అనుమానాలను నిజం చేస్తూ ఓ షాకింగ్ దృశ్యం కంటపడింది. అక్కడున్న ఓ వాటర్‌ ట్యాంక్‌లో మహిళ శరీరభాగాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. చత్తీస్‌ఘడ్‌లో(Chattisgarh) తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

బిలాస్‌పూర్(Bilaspur) నగరం ఉస్లాపూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో నివసించే పవన్ సింగ్‌కు భార్య, కొడుకు(5), కూతురు(3) ఉన్నారు. అయితే.. స్థానిక పోలీసులు ఇటీవల పవన్‌ను నకిలీ నోట్ల దందా కేసులో అరెస్టు చేశారు. ఆపై అతడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి భార్య శరీర భాగాలు కనిపించాయి. ఈ విషయమై పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తానే భార్యను హత్య చేశానని అంగీకరించాడు. ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే అంతమొందించానని చెప్పుకొచ్చాడు(Husband kills wife).

పవన్ సింగ్‌ది ప్రేమ వివాహం. అతడి భార్య ఇంట్లోంచి పారిపోయి వచ్చి అతడిని పెళ్లి చేసుకుంది. కూతురి ప్రేమ వివాహం కారణంగా తల్లిదండ్రులు ఆమెకు దూరమయ్యారు. ఆమె రెండు నెలలుగా కనిపించకుండా పోయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో పవన్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. పని మీద వేరో చోటుకు వెళుతున్నానంటూ పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టిన అతడు చివరకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా.. పదేళ్ల క్రితం పవన్ వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.

Updated Date - 2023-03-06T18:36:03+05:30 IST