మీ కూతురికి పిచ్చి పట్టిందంటూ ఊరంతా ఎగతాళి చేశారు.. అదే యువతికి మోదీ చేతుల మీదుగా అవార్డు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-30T20:21:13+05:30 IST

మీ కూతురికి పిచ్చి పట్టిందంటూ ఊరంతా ఎగతాళి చేశారు.. అదే యువతికి మోదీ చేతుల మీదుగా అవార్డు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

మీ కూతురికి పిచ్చి పట్టిందంటూ ఊరంతా ఎగతాళి చేశారు.. అదే యువతికి మోదీ చేతుల మీదుగా అవార్డు.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: మీ కూతురు పిచ్చిదంటూ ఊరంతా ఎగతాళి చేశారు. దీంతో.. ఆ కుటుంబంలో కల్లోలం రేగింది. తీరు మార్చుకోవాలంటూ యువతిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరిగింది. కానీ.. ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన నిర్ణయంతో ఊరికి మంచి జరుగుతుందని బలంగా నమ్మింది. ఆ నమ్మకమే చివరకు గ్రామస్తుల నీటి కష్టాలను తీర్చింది. మడమతిప్పిన వ్యక్తిత్వంతో గ్రామస్తులకు కొత్తమార్గం చూపిన ఆ యువతి ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ దృష్టిలో పడింది. త్వరలో ఆమె ప్రధానిని కలిసి తన విజయగాథను వినిపించనుంది.

అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్ జిల్లా(Chhatarpur). ఆ జిల్లాలో అగ్రోథా అనే చిన్న గ్రామంలో ఉంది. ఆ గ్రామం పేరు ప్రస్తావిస్తే ముందుగా గుర్తొచ్చేది నీటి ఎద్దడే(Water Shortage). ఎండాకాలం వచ్చిందంటే చాలు..అక్కడ నీటికి తీవ్ర కటకట ఏర్పడేది. ఆ ప్రాంతమంతా తీవ్ర కొరత ఏర్పడేది. గ్రామంలోని మహిళలు అందరూ సమీపంలోని బోరింగ్ పంపుల వద్ద బారులు తీరే వారు. నీటి కోసం వారి మధ్య తగాదాలు జరిగేవి. చిన్న పిల్లలు..ముఖ్యంగా ఆడపిల్లలు తమ చదువులు మాని మరీ నీటిని తేవాల్సి వచ్చేది.

అలాంటి సమయంలో వారి గ్రామంలోకి ఓ స్వచ్ఛంధ సంస్థ వచ్చింది. వాన నీటిని ఒడిసి పడితే వారి కష్టాలన్నీ తీరిపోతాయని ఎన్‌జీవో వారు చెప్పారు. గతంలో ఎందరో ప్రభుత్వాధికారుల నుంచి ఇలాంటి హామీలు విన్న గ్రామస్తులు ఆ ఎన్‌జీవో సభ్యుల మాటలు లక్ష్యపెట్టలేదు. కానీ.. బబితా(Babita Rajpoot) మాత్రం అలా కాదు. ఆమెకు ఎందుకో ఎన్‌జీవో చెప్పింది జరుగుతుందని అనిపించింది. దీంతో.. ఆమె వారు ఏర్పాటు చేసే శిక్షణాకార్యక్రమాలకు హాజరైన అక్కడ చెప్పిన పరిష్కార మార్గాలను అమలు చేసింది.

గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కాలువపై చెక్ డ్యామ్స్ నిర్మించి వాన నీటిని ఒడిసిపట్టింది. ఇంకేముంది..క్రమంగా భూమిలోపలి నీటి నిల్వలు పెరిగాయి. గ్రామంలోని ఓ కొలను కూడా నీటితో కళకళలాడటం ప్రారంభించింది. దీంతో.. నీటి కష్టాలు కొంత మేరకు తీరాయి. దీంతో బబితతో పాటూ ఆమెకు సాయ పడ్డవారందరిపైనా ప్రశంసల వర్షం కురిసింది. ఆ తరువాత వారు మరింత ముందుకెళ్లి ఎండిపోయిన ఓ సర్సును పునరుద్ధరించారు. ఇందుకు కోసం ఏకంగా ఓ కొండను తొలిచి సరస్సులోకి నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో.. యువతి పేరు ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె విజయగాథ ఏకంగా ప్రధానికి చేరింది. అయితే.. ఈ విజయం తన మాత్రమే కాదని, ఇది తామందరం కలిసి సమిష్టిగా సాధించిన విజయమని ఆమె స్థానిక మీడియాతో వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-03-30T20:21:13+05:30 IST