హిందూ ఆచారాలను అపహాస్యం చేసిన బ్రిటన్... చార్లెస్- III పట్టాభిషేక వేడుకల్లో ఎన్ని మూఢాచారాలను అనుసరించిందంటే...

ABN , First Publish Date - 2023-05-07T10:33:15+05:30 IST

తాజాగా బ్రిటన్‌లో జరిగిన చార్లెస్- III(Charles- III) పట్టాభిషేక వేడుకల్లో లెక్కకు మించిన మూఢాచారాలు చోటు చేసుకున్నయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హిందూ ఆచారాలను అపహాస్యం చేసిన బ్రిటన్... చార్లెస్- III   పట్టాభిషేక వేడుకల్లో ఎన్ని మూఢాచారాలను అనుసరించిందంటే...

భారతీయుల మతపరమైన ఆచారాలను, ముఖ్యంగా విగ్రహారాధనను బ్రిటీషర్లు అపహాస్యం(ridicule) చేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అలాంటిది.. తాజాగా బ్రిటన్‌లో జరిగిన చార్లెస్- III(Charles- III) పట్టాభిషేక వేడుకల్లో లెక్కకు మించిన మూఢాచారాలు చోటు చేసుకున్నయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మే 6న లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే(Westminster Abbey)లో కింగ్ చార్లెస్- III పట్టాభిషేక వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో చార్లెస్‌తో పాటు క్వీన్ కన్సార్ట్ కెమిల్లా(Queen Consort Camilla) కిరీటం ధరించి కనిపించారు. క్వీన్ ఎలిజబెత్(Queen Elizabeth) 2022లో మరణించినప్పుడు చార్లెస్‌ను అధికారికంగా రాజుగా ప్రకటించారు. బ్రిటన్ చక్రవర్తి రెండు రోజుల పట్టాభిషేక వేడుకల గురించి సాధారణ బ్రిటన్ ప్రజలు ఏమనుకుంటున్నారనే తెలుసుకునేముందు యుగయుగాలుగా బ్రిటన్ రాచరిక కుటుంబం(Britain's royal family) అనుసరిస్తున్న మూఢాచారాల గురించి ఇప్పుడు తెలుసుకందాం. ముందుగా రాజును అత్యంత ఘనమైన వ్యక్తిగా చూపిస్తారు. క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం సమయంలోనూ కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్, లార్డ్ ఛాన్సలర్(Lord Chancellor), లార్డ్ గ్రేట్ ఛాంబర్‌లైన్, లార్డ్ హై కానిస్టేబుల్ (ఇంగ్లండ్), ఎర్ల్ మార్షల్ తదితరులు రాణిని అత్యంత గొప్పవారిగా ప్రజలకు చూపించారు. థియేటర్‌కు నలువైపులా ఉన్న ప్రజలు చూసేలా ఆమెను కూర్చోబెట్టారు.

Untitled-7.jpg

కింగ్ చార్లెస్(King Charles) విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించారు. కొత్త రాజును చూపించి 'గాడ్ సేవ్ ది కింగ్' లేదా 'గాడ్ సేవ్ ది క్వీన్' అని ప్రతిస్పందించాలా అని అబ్బేలోని అతిథులను అడిగారు. రాజు అప్పుడు ఒక ప్రమాణంపై సంతకం చేశారు, అక్కడి చట్టాల ప్రకారం దయతో పాలిస్తానని వాగ్దానం చేశారు. రాజు సాంప్రదాయకంగా క్రిమ్సన్ రోబ్ ఆఫ్ స్టేట్(Crimson Robe of State) ధరించారు. కొత్త రాజుకు పవిత్ర తైలంతో అభిషేకం చేశారు. పట్టాభిషేక ఉంగరం, రాజదండం అందించారు. సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటం ధరింపజేశారు. 1300లో కింగ్ ఎడ్వర్డ్- I కోసం తయారు చేసిన పట్టాభిషేక కుర్చీలో రాజు కూర్చున్నారు. ఈ ఆసనం చారిత్రాత్మకంగా "ది స్టోన్ ఆఫ్ డెస్టినీ" అని కూడా పిలిచే స్టోన్ ఆఫ్ స్కోన్‌(Stone of Scone)ను కలిగి ఉంది. ఈ రాయి స్కాట్లాండ్ రాజులకు సంబంధించిన విలువైన పురాతన వస్తువు.

Untitled-8.jpg

1996 నుండి దీనిని పట్టాభిషేక సమయంలో వినియోగిస్తుంటారు. ఎడిన్‌బర్గ్ కాజిల్‌లో దీనిని భద్రపరుస్తారు. బ్రిటన్ పట్టాభిషేక సంప్రదాయాలను అనుసరించి, కింగ్ చార్లెస్ III కాంటర్బరీ ఆర్చ్ బిషప్(Archbishop of Canterbury) అభిషేకించారు. ఇది పట్టాభిషేకంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆర్చ్ బిషప్ ఒక పాత్రలో నుండి పవిత్రమైన నూనెను ఒక పాత్రలోకి పోస్తారు. దానిని రాజు చేతులు, తల, రొమ్ములపై పడేలా చేసి అభిషేకించారు. దీనిని అత్యంత పవిత్రమైన క్షణంగా భావించి, గాయక బృందం సాంప్రదాయక రీతిలో 'జాడోక్ ది ప్రీస్ట్' పాట పాడుతుంది. UK వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం సార్వభౌమాధికారి ఆర్చ్‌బిషప్ చేత అభిషిక్తుడవుతాడు. ఆశీర్వాదాలు పొంది పవిత్రం(sacred) అవుతాడు. అనంతరం కింగ్ ఎడ్వర్డ్ కుర్చీలో కూర్చుంటారు. అనంతరం ఒక గోళం, రాజదండాలను స్వీకరించిన తర్వాత, ఆర్చ్ బిషప్.. రాజు తలపై సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని(crown) ధరింపజేస్తారు. అభిషేకం తరువాత సూపర్‌ట్యూనికా, పొడవాటి ఇంపీరియల్ మాంటిల్ అని పిలిచే అద్భుతమైన బంగారు వస్త్రాన్ని చక్రవర్తికి ధరింపజేస్తారు.

రాజుకు పట్టాభిషేకం అనంతరం పలు విలువైన వస్తువులు అందజేస్తారు. వీటిలో గోల్డ్ స్పర్స్, ఆభరణాలతో కూడిన స్వోర్డ్ ఆఫ్ ఆఫరింగ్ ఆర్మిల్స్ ఉంటాయి. అర్మిల్స్(armils) అనేది చిత్తశుద్ధి, జ్ఞానాన్ని సూచించే బంగారు ఆభరణాలుగా చెబుతారు. చివరిగా రాజు తలపై అద్భుతమైన సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటం ధరింపజేయడంతో వేడుక ముగుస్తుంది. రాజు అప్పుడు ఊదారంగు వెల్వెట్(Velvet) వస్త్రాన్ని మార్చుకుంటాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సీనియర్ అధికారులు కొత్తగా పట్టాభిక్తుడైన రాజు కిరీటాన్ని తాకి, చక్రవర్తి కుడి చేతిని ముద్దాడుతారు. కాగా పట్టాభిషేకం నాడు బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి గోల్డ్ స్టేట్ కోచ్‌లో వెస్ట్‌మినిస్టర్ అబ్బే వరకు ఊరేగింపు జరుగుతుంది. సాంప్రదాయకంగా లండన్(London) వీధుల్లో ఈ ఊరేగింపు జరుగుతుంది.

Untitled-10.jpg

వీలైనంతమంది చూసేందుకు వీలుగా ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రిటన్ మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, జపాన్, ఖతార్, నెదర్లాండ్స్(Netherlands), భూటాన్, స్పెయిన్, థాయ్‌లాండ్, బహ్రెయిన్ తదితర దేశాలలో ఇటువంటి రాచరిక వ్యవహరాలు కనిపిస్తాయి.

ఎలిజబెత్ II మరణానంతరం కింగ్ చార్లెస్ బ్రిటీష్ సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే, 'నాట్ మైకింగ్' అనే హ్యాష్‌ట్యాగ్(Hashtag) సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. పట్టాభిషేక దినమైన మే 6న కూడా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి కొన్ని గంటల ముందు రాచరిక వ్యతిరేక బృంద రిపబ్లిక్(Republic) నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

UKలో రాచరిక వ్యతిరేక సెంటిమెంట్ 'రిపబ్లిక్ ప్రచారం' ద్వారా ఊపందుకుంది. రాచరికం అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని ఈ బృందం వాదిస్తుంటుంది. మరోవైపు బ్రిటన్... పేదరికం, ద్రవ్యోల్బణం(Inflation)తో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం పట్టాభిషేక వేడుకలకు ప్రజా ధనాన్ని ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌(Opinion polls)లో రాచరికంపై వ్యతిరేకత, ఉదాసీనత రెండూ పెరుగుతున్నాయని వెల్లడయ్యింది.

Updated Date - 2023-05-07T11:07:10+05:30 IST