వీళ్ల ఓపికకు నిజంగా హ్యాట్సాఫ్.. ఇదేం తలనొప్పి అని వేరే పెళ్లి చేసుకోకుండా నిశ్చితార్థం అయ్యాక కూడా ఏడేళ్లు నిరీక్షించి మరీ..

ABN , First Publish Date - 2023-03-18T17:53:44+05:30 IST

వీళ్ల ఓపికకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

వీళ్ల ఓపికకు నిజంగా హ్యాట్సాఫ్.. ఇదేం తలనొప్పి అని వేరే పెళ్లి చేసుకోకుండా నిశ్చితార్థం అయ్యాక కూడా ఏడేళ్లు నిరీక్షించి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక జమానాలో యువత చాలా ఫాస్ట్ అయిపోయారు. జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటి వ్యవహారాల్లోనూ దురదృష్టవశాత్తూ ఈ దూకుడు కనిపిస్తోంది. అలా ప్రేమలో పడటం.. ఇలా బ్రేకప్ చెప్పేయడం.. పెళ్లై పట్టుమని పది రోజులు కూడా గడవక మునుపే విడాకులకు సిద్ధమైపోవడం.. వంటివి ఇటీవల కాలంలో కనిపిస్తున్న పెడ ధోరణులు. ఇలాంటి నేపథ్యంలో ఓ జంటపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మందిలాగే వారు కూడా తొలిచూపులోనే ఒకరికొకరు నచ్చేశారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇంతలోనే ఊహించని అడ్డంకి ఏర్పడింది. దాన్ని అధిగమించి పెళ్లి చేసుకునేందుకు వారికి ఏకంగా ఏడేళ్లు పట్టింది(Marriage after 7 year of Engagement). దాయదిదేశాల మధ్య సరిహద్దును సైతం చెరిపేయగల ప్రేమ వారిది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు(Punjab) చెందిన నమన్ లుథారా ఓ లాయర్. బటాలాలో(Batala) నివసిస్తుంటారు. స్వాతంత్ర్యం వచ్చాక అతడి కుటుంబం పాకిస్థాన్ నుంచి వలసొచ్చింది. అయితే..నమన్ బంధువుల్లో కొందరు పాకిస్థాన్‌లోనే ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. సుమారు ఏడేళ్ల క్రితం నమన్ తన బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్కడ తనకు వరుసయ్యే ఓ యువతి షాలీన్‌ను చూశారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చేశారు. ఇరు కుటుంబాలూ వారి వివాహానికి అంగీకరించాయి. ఆ వెంటనే వారి నిశ్చితార్థం(Engagement) జరిగిపోయింది. కానీ.. ఆ తరువాత వారి ప్రేమకు అసలు పరీక్ష మొదలైంది.

తొలుత 2016లో ఓసారి ఆమె ఇండియాకు. కాబోయే భర్త కుటుంబాన్ని పరిచయం చేసుకుని మళ్లీ వెళ్లిపోయింది. మరి కారణమేంటో తెలీదు కానీ.. ఆ తరువాత ఆమె మళ్లీ వీసా పొందేందుకు ఆమె చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. అయితే.. ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వచ్చినా వారి మధ్య ప్రేమ తగ్గకపోగా మరింతగా పెరిగింది. ఈ క్రమంలో షాలీన్ వీసా కష్టాలు కూడా తొలగిపోయాయి. ఆమెకు ఇటీవలే వీసా మంజూరు అయినట్టు నమన్ మీడియాకు తెలిపారు. ఏప్రిల్‌లో ఆమె ఇండియాకు వస్తుందని మురిసిపోతూ చెప్పాడు. ఈ ప్రేమ జంట ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Updated Date - 2023-03-18T17:53:44+05:30 IST