Car Accident: ఏ లోకంలో ఉన్నావయ్యా బాబూ.. యాక్సిడెంట్ అవడమే కాదు.. కారు ఏకంగా బిల్డింగ్ పైకే ఎక్కేసిందిగా..!
ABN , First Publish Date - 2023-08-10T18:06:43+05:30 IST
పెన్సిల్వేనియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు ఏకంగా ఓ భవంటి పైభాగంలోకి దూసుకుపోయింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో(Accident) ఎంతటి భయానక దృశ్యాలు ఆవిష్కతమవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం ఓ రోడ్డు యాక్సిడెంట్ దృశ్యాలను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఓ భవంతిపై భాగంలోకి కారు దూసుకుపోవడమే ఇందుకు కారణం. డ్రైవర్ ఏ లోకంలో ఉన్నాడో? కారును రోడ్డు మీద నడిపాడో లేక గాల్లో నడిపాడో అనుకుంటూ జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతటి బరువైన కారు బిల్డింగ్ పైకి ఎక్కిందంటూ ఆశ్చర్యపోతున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి(Pennsylvania) చెందిన జంక్షన్ ఫైర్ కంపెనీ పోస్ట్ చేసిన యాక్టిడెంట్ తాలూకు చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భవంతి రెండో అంతస్తులో కారు ఇరుక్కుపోయినట్టు తమ కబురు అందిందని సంస్థ చెప్పుకొచ్చింది(Car Crash into building). కాగా, యాక్సిడెంట్ జరిగిన విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న అత్యవసర సిబ్బంది, కారు కిందకు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తరువాత డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి వయసు సుమారు 20 ఏళ్లు ఉండొచ్చని గుర్తించారు. కాగా, జంక్షన్ కారు కంపెనీ వారు ఇరుక్కుపోయిన కారును జాగ్రత్తగా కిందకు దించారు. ఆదివారం సాయంత్రం డికాటూర్ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ యాక్సిడెంట్ తాలూకు చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఫొటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.