Viral: బిట్స్ పిలానీలో బీటెక్.. ఐఐఎమ్ నుంచి ఎంబీయే..మంచి జాబ్‌ను కాదనుకుని ఇతడు ఏం చేశాడో తెలిస్తే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 06:59 PM
ఐఐఎంలో ఎంబీయే చేసి గొప్ప బ్యాంకు ఉద్యోగం కూడా కాదనుకుని ఐఏఎస్ అయ్యాయడో యువకుడు.
ఇంటర్నెట్ డెస్క్: కాలం మారినా కూడా ఐఏఎస్ ఉద్యోగాలకు క్రేజ్ అస్సలు తగ్గలేదు. ప్రతిష్ఠాత్మక చదువులు చదివిన ఎందరో యువత లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకుని ఐఏఎస్‌లుగా మారుతున్నారు. సమాజంలో గౌరవం, హోదాకు మించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ ట్రెండ్‌లో తాజా ఉదాహరణగా నిలిచాడు దివ్యాంషూ చౌదరి (IAS Divyanshu Choudhary). ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న ఆయన గొప్ప ఉద్యోగం కాదనుకుని మరీ ప్రజాసేవ వైపు మళ్లారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దివ్యాంషూ స్కూల్ చదువుల తరువాత బిట్స్ పిలానీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరారు. ఆ తరువాత ప్రతిష్ఠాత్మక ఐఐఎం కోల్‌కతా నుంచి ఎంబీయే పూర్తి చేశారు. ప్రతిభకు ఉన్నత చదువులు తోడవడంతో దివ్యాంషూకు ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం దొరికింది. కానీ ఏడాదికే బ్యాంకు జాబ్‌కు రాజీనామా చేసి సివిల్స్ పరీక్షల ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.
ఈ మధ్య యువతలో అనేక మంది కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధిస్తున్నారు. దివ్యాంషూ కూడా అదే రూట్లో ఆన్‌లైన్‌పై ఎక్కువగా ఆధారపడి ప్రిపరేషన్ కొనసాగించారు. తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోయినా 2020లో రెండోసారి అటెంప్ట్‌లో ఏకంగా ఆల్ ఇండియా 30 ర్యాంకు సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.