Pathaan: ‘దంగల్’ రికార్డును చెరిపేసి ‘బాహుబలి 2’ పై కన్నేసిన ‘పఠాన్’

ABN , First Publish Date - 2023-02-05T17:08:21+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

  Pathaan: ‘దంగల్’ రికార్డును చెరిపేసి ‘బాహుబలి 2’ పై కన్నేసిన ‘పఠాన్’

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా ఈ చిత్రం రూ.400కోట్లకు పైగా కొల్లగొట్టి అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.

‘పఠాన్’ సినిమా శనివారం రూ.22.5కోట్ల వసూళ్లను రాబట్టి రూ.400కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఇప్పటి వరకు అన్ని వెర్షన్స్ కలిపి రూ.401.4కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. రూ.400కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్ మూవీగా నిలిచింది. బీ టౌన్‌లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్ల రికార్డు ‘దంగల్’ పేరిట ఉంది. ఈ చిత్రం అప్పట్లో రూ.387కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ‘పఠాన్’ తాజాగా ‘దంగల్’ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. ఇదే స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడితే రాబోయే రోజుల్లో ‘కెజిఎఫ్ 2’ (KGF 2), ‘బాహుబలి 2’ (Baahubali 2) వసూళ్లను ‘పఠాన్’ అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘పఠాన్’ చిత్రం రూ.400కోట్ల వసూళ్లను సాధించడానికి 12రోజులు పడితే, ‘బాహుబలి 2’ కు 15రోజులు, ‘కెజియఎఫ్ 2’ కు 23 రోజులు పట్టింది. ఇక షారూఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘జీరో’ లో చివరగా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత ‘పఠాన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘జవాన్’, ‘ఢంకీ’ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాలపై కూడా భారీ బజ్ ఉంది.

Updated Date - 2023-02-05T17:12:47+05:30 IST