Viral Video: డాన్స్ చేయాలన్న ఈ మహిళ కోరికకు పాపం.. ఈ పిల్లాడు బలయ్యాడు.. వెనక పిల్లాడు ఉన్నాడన్నది తెలియక..!

ABN , First Publish Date - 2023-03-30T20:39:42+05:30 IST

డాన్స్ చేయాలన్న ఈ మహిళ కోరికకు పాపం.. ఈ పిల్లాడు బలయ్యాడు..

Viral Video: డాన్స్ చేయాలన్న ఈ మహిళ కోరికకు పాపం.. ఈ పిల్లాడు బలయ్యాడు.. వెనక పిల్లాడు ఉన్నాడన్నది తెలియక..!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడికొచ్చిన బంధువులు, స్నేహితులు కచ్చితంగా డ్యాన్స్ చేయాల్సిందే. అడా, మగ, పిల్లా, పెద్దా అనే తేడాలేవీ లేకుండా అందరూ చక్కగా స్టెప్పులేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు నలుదిశలా వ్యాపించింది. ఫంక్షన్‌లకు వచ్చిన అతిథులు స్టెప్పులేయడం ఇప్పుడో సాధారణ దృశ్యం. అయితే..ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ.. ఓ హరియాణవీ పాటకు(Haryanvi song) ఓ ఫంక్షన్‌లోని మహిళలందరూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. భారీకాయురాలైన ఓ మహిళ కూడా ఫుల్ జోష్‌లో డ్యాన్స్ ప్రారంభించింది. ఆమె వెనకాలే డ్యాన్స్ చేస్తున్న ఓ బుడ్డోడు అకస్మాత్తుగా మహిళ కాళ్లకు అడ్డం పడ్డాడు. దీంతో.. కంగారు పడ్డ మహిళ వెంటనే కింద పడిపోతోంది. ఈ క్రమంలో బాలుడి చేయి కూడా ఆమె కింద పడి కాస్తంత నలుగుతుంది(Woman trips and falls on Kid). అయితే.. అక్కడే ఉన్న మరో మహిళ రాబోయే అపాయాన్ని ముందుగానే గ్రహించి చిన్నారిని వేగంగా పక్కకు లాగేసింది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral Video) అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

Updated Date - 2023-03-30T20:39:42+05:30 IST