MegaStarChiranjeevi: ఆర్టిస్టులు ఏడవకుండా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాలి

ABN , First Publish Date - 2023-02-20T10:35:02+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు.

MegaStarChiranjeevi: ఆర్టిస్టులు ఏడవకుండా ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాలి

ఆదివారం నాడు కళాతపస్వి కె విశ్వనాధ్ (Kalatapasvi K Viswanath) గారికి కళాంజలి అనే ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎవరు చనిపోయినా శ్రద్ధాంజలి పెడుతూ వస్తూ వున్నారు, కానీ ఎందుకో దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke Award Winner) అవార్డు విన్నర్, తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిక్సూచిని మార్చిన విశ్వనాధ్ గారిని మాత్రం మరిచిపోయారు.

chiranjeevi-kv2.jpg

అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (Peoples Media Factory) అధినేత విశ్వప్రసాద్ (Viswaprasad), వివేక్ కూచిబొట్ల (Vivek Koochibotla) మాత్రం విశ్వనాధ్ గారికి ఏదైనా చెయ్యాలని ఆదివారం నాడు పార్క్ హయాత్ హోటల్ లో ఈ ఈవెంట్ నిర్వహించారు. కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి గారు తన హోటల్ లో వేదికని ఫ్రీ గా చేసుకోమని ఇచ్చారు. వీరికి సంతోషం సురేష్, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ సహాయ పడ్డారు.
chiranjeevi-kv1.jpg

మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా రావటం, ఇంకా ఆసక్తికరం ఏంటి అంటే, చెన్నై బెంగుళూరు నుండి చాలామంది నటీనటులు రావటం, మన తెలుగు పరిశ్రమకి చెందిన వారు కనీసం మొహాలు చూపించకపోవడం.

మీనా, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుమలత(Sumalatha), రాధిక (Radhika Sarathkumar), శరత్ కుమార్, రోజారమణి (Roja Ramani), మంజుభార్గవి (Manjubharghavi), ఝాన్సీ, ఆమని (Amani), లక్ష్మి ఇలా పై ఊర్ల నుండి చాలామంది వచ్చారు. కె. రాఘవేంద్ర రావు, జయసుధ (Jayasudha), జీవిత (Jeevitha Rajasekhar), రాజశేఖర్, తనికెళ్ళ భరణి (Thanikella Bharani), శేఖర్ కమ్ముల(Sekhar Kammula), అలీ (Ali), శివలెంక కృష్ణ ప్రసాద్, దామోదర ప్రసాద్, అశ్వని దత్, వై. వి. ఎస్. చూద్ధారి ఇలా మరికొంతమంది మాత్రమే ఈ సభకు హాజరయ్యారు. చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ సభని జయప్రదం చేశారు.

chiranjeevi-kv3.jpg

ఈ సందర్భంగా చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు. చాలామంది యువ దర్శకులు ఆయన సినిమాలు చూసి నేర్చుకోవాలి అని అందరికీ చెపుతూ వుంటాను.

chiranjeevi-kv5.jpg

"శంకరాభరణం (Shankarabhranam) సినిమా కనక చూస్తే, శాస్త్రి గారి కూతురి పెళ్లి చూపుల్లో కూతురు శారదా పాట పడుతుంది. ఆ పాత లయ తప్పినప్పుడు శాస్త్రి గారు శారదా అని గట్టిగా అరుస్తారు. ఆ తరువాత శాస్త్రి గారు చేతిలో కర్పూరం వేసుకొని హారతి ఇస్తారు. చెయ్యి కాలిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడు, సరదా తండ్రి చేతికి నవనీతం రాస్తూ మళ్ళీ అదే పాటని కరెక్టుగా పాడుతూ ఉంటుంది. తండ్రి కూడా ముగ్దుడవుతాడు. ఆ సన్నివేశం లో వాళ్ళు ఏడవారు, కానీ చూసే ప్రేక్షకులుకి ఏడుపు వస్తుంది. అదీ విశ్వనాధ్ గారు అంటే," అని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు.

jeevitha-rajasekhar.jpg

ఆర్టిస్టులు తాము తెర మీద ఏడుస్తూ ఉంటే బాగోదు అని, తెర మీద ఏడవకుండా ప్రేక్షకులకి ఏడుపు తెప్పించాలి. అది నటన అంటే, సన్నివేశం అంటే, అది విశ్వనాధ్ గారి స్కూల్ అని, అలంటి స్కూల్ లో తాను కూడా ఒక స్టూడెంట్ అయినందుకు గర్వాంగా ఉంటుంది అని, ఆయనని చూసి నేర్చుకోవాలని చెప్పారు చిరంజీవి గారు. తనకు విశ్వనాధ్ గారు గురుతుల్యులు అని, పితృసమానులు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అందుకే నేను విశ్వనాధ్ గారి దగ్గర నేర్చుకొన్నవి నా వంతుగా నేను నేను పని చేసే దర్శకులకి చెపుతూ వుంటాను అని చెప్పారు చిరంజీవి.

Updated Date - 2023-02-20T10:36:20+05:30 IST