అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-08T09:09:18+05:30 IST

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం(Govt job) దక్కించుకునేందుకు భారత్‌లో మాదిరిగానే సుదీర్ఘమైన ప్రక్రియ(long process) ఉంటుంది. అమెరికాలో మూడు రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం(Govt job) దక్కించుకునేందుకు భారత్‌లో మాదిరిగానే సుదీర్ఘమైన ప్రక్రియ(long process) ఉంటుంది. అమెరికాలో మూడు రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. స్థానిక, రాష్ట్ర, సమాఖ్య అనే కేటగిరీలు(categories) ఉంటాయి.

అర్హతను అనుసరించి ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో కొన్ని ప్రత్యేక ఉద్యోగాల కోసం సివిల్ సర్వీస్(Civil Service) పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. దీని తర్వాత మాత్రమే ఈ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వస్తారు. దీని కోసం సివిల్ సర్వీస్ కమిషన్ ఆఫ్ అమెరికా సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) ఒక పరీక్షను నిర్వహిస్తుంది.

ఈ పరీక్షకు అమెరికా(America)కు చెందిన యువత హాజరవుతుంది. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే ముందుగా మీరు USAJOBSలో ప్రొఫైల్‌ను క్రియేట్(Create a profile) చేయాలి. ఆ తర్వాతనే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అమెరికాలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల గురించిన సమాచారం(Information) అందుబాటులో ఉంటుంది.

ఎవరైనా వారి విద్యార్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకుని అనంతరం ఈ వెబ్‌సైట్(website) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత ఆ ఉద్యోగానికి పోటీ పరీక్ష రాయాలి. అందులో ఉత్తీర్ణత(pass) సాధించిన తర్వాతనే ఉద్యోగం పొందగలుగుతారు.

Updated Date - 2023-04-08T09:09:42+05:30 IST