RRR: రాజమౌళి విషయంలో భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు.. పూర్తిగా అటే తీసుకెళతారేమోనంటూ..

ABN , First Publish Date - 2023-01-30T11:42:00+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సినిమా క్రియేట్ చేస్తున్న సంచనాల గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నిరోజుల క్రితం ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) అందుకున్న విషయం తెలిసిందే.

RRR: రాజమౌళి విషయంలో భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు.. పూర్తిగా అటే తీసుకెళతారేమోనంటూ..
RRR

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సినిమా క్రియేట్ చేస్తున్న సంచనాల గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నిరోజుల క్రితం ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవలే ఈ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్‌ (Oscar) 2023కి సైతం నామినేట్ అయ్యింది. అయితే ఈ సినిమా వల్ల మూవీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ఇతర హాలీవుడ్ సెలిబ్రిటీలు ఆయన్ని అక్కడ సినిమాలు చేయడానికి ఆహ్వానించారు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళిపై తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వెస్ట్‌ (హాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమలు)లో అందరూ రాజమౌళిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా టాలెంటెడ్ దర్శకుడు. డీసీ లేదా మార్వెల్ వంటి చిత్రాలకి సరిగ్గా సరిపోయే దర్శకుడు. భారతదేశం, పశ్చిమ దేశాల సినీ పరిశ్రమలు కలిసి పని చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. రాజమౌళి విషయంలో మాత్రం వారి ఆలోచన విధానం వేరు. ఆయన్ని మన దగ్గర నుంచి దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నాడు.

Updated Date - 2023-02-01T11:53:43+05:30 IST