Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

ABN , First Publish Date - 2023-02-05T20:17:11+05:30 IST

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా బన్నీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ అందుకున్నారు. ఆ గిప్ట్‌ ఇచ్చింది ఎవరో కాదు..

Pushpa Gift: కొడుకు సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. మురిసిపోతున్న తండ్రి!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Icon star allu arjun) ప్రస్తుతం ‘పుష్ప-2’ (pushpa 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ (sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా బన్నీ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ Allu ayaan surprise gift to bunny) అందుకున్నారు. ఆ గిప్ట్‌ ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన తనయుడు అల్లు అయాన్‌. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ లారీలో (pushpa lorry)ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే! అందులో ఉన్న లారీ లాంటి బొమ్మను అల్లు అర్జున్‌కి గిప్ట్‌గా ఇచ్చారు అయాన్‌. ఆ గిప్ట్‌ చూసి తెగ మురిసిపోతున్నారు బన్నీ. ఆ ఫొటోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా స్వీటెస్ట్‌ సోల్‌.. చిన్నిబాబు అయాన్‌ నుంచి వచ్చిన అందమైన బహుమతి’ అని రాసుకొచ్చారు. ‘పుష్ప’ సినిమాలో లారీని అలంకరించిన తీరులోనే ఆ లారీ బొమ్మ ఉంది. టాప్‌పైన ‘పుష్ప’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘పుష్ప’ సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవడంతో రెండో పార్ట్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. అంతకుమించి అనేలా తెరకెక్కించడానికి సుకుమార్‌ అండ్‌ కో మెరుగులు దిద్దుతున్నారు. ఇటీవల అబ్రాడ్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతుంది. నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌, అజయ్‌ ఘోష్‌, ధనుంజయ్‌లతోపాటు సుకుమార్‌ మరి కొన్ని కొత్త పాత్రలను క్రియేట్‌ చేయబోతున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - 2023-02-05T20:32:44+05:30 IST