AlluArjun: అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుడు

ABN , First Publish Date - 2023-01-20T15:35:15+05:30 IST

ఒక్క తెలుగుకే కాదు, మొత్తం దక్షిణ భారత దేశానికీ చెందిన నటుల్లో అల్లు అర్జున్ గురించే ఎక్కువ వెతికారు గూగుల్ లో అని అధికారికంగా ప్రకటించారు కూడా.

AlluArjun: అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుడు

ఈమధ్య గూగుల్ లో ఎక్కువ వెతికిన నటుల్లో నెంబర్ వన్ లో వున్నది ఎవరో తెలుసా? అల్లు అర్జున్ (Allu Arjun is the most searched actor in Google from South). ఇది ఒక్క తెలుగుకే కాదు, మొత్తం దక్షిణ భారత దేశానికీ చెందిన నటుల్లో అల్లు అర్జున్ గురించే ఎక్కువ వెతికారు గూగుల్ లో అని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. అల్లు అర్జున్ గత రెండు సినిమాలు నుంచి తన పాపులారిటీ విపరీతంగా పెంచుకున్నాడు. 'అల వైకుంఠపురం లో' (#AlaVaikuntapuramLo) అనే సినిమా చాల పెద్ద బ్లాక్ బస్టర్ అవటమే కాకుండా పరిశ్రమలో ఎక్కువ రెవిన్యూ వసూలు చేసిన సినిమాల్లో ఆరో స్థానం లో వుంది. అలాగే 2021 లో విడుదల అయిన 'పుష్ప' (#Pushpa) సినిమా అయితే మొదటి అయిదు స్థానాల్లో ఐదో స్థానం సంపాదించింది. (Pushpa is in the top 5 list of highest grossing films) అంటే అల్లు అర్జున్ పాపులారిటీ ఎంత పెరిగిందో, అతని మార్కెట్ కూడా ఎంత విస్తరించుకున్నాడో అర్థం అవుతుంది. 'పుష్ప' అనే సినిమా అయితే అల్లు అర్జున్ ని అంతర్జాతీయంగా కూడా పేరు వచ్చేట్టు చేసింది. అంతలా ఆ సినిమా హిట్ అయి, ఇప్పుడు ఆ సినిమా రెండో పార్టు 'పుష్ప 2' (#Pushpa2) కోసం ఎదురు చూసేట్టు చేసింది.

allu-arjun-pp.jpg

అయితే ఒక్క గూగుల్ లో వెతికిన నటుల్లో నెంబర్ వన్ స్థానం లో ఉండటమే కాకుండా, దక్షిణ భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు కూడా అల్లు అర్జున్ అని పరిశ్రమలో అంటున్నారు. (Allu Arjun is the highest paid actor in South) ఎందుకంటే అతను 'పుష్ప 2' కోసం 125 కోట్లు పారితోషికం తీసుకున్నాడని వినికిడి. (He is charing Rs125 crore for Pushpa 2, says a source) ఇంతవరకు ఇంతలా పారితోషికం ఎవరూ తీసుకోలేదు. ఒకప్పుడు 'స్టైల్' స్టార్ అనే అల్లు అర్జున్ ని ఇప్పుడు 'ఐకాన్' స్టార్ అంటున్నారు. ఇప్పుడు 'పుష్ప 2' షూటింగ్ వైజాగ్ (Pushpa 2 shooting is going on in Vizag at present) లో జరుగుతోంది. ఈ సినిమా అతన్ని ఇంకా చాల పై స్థాయికి తీసుకు వెళుతుంది అనటం లో కూడా సందేహం లేదు అని పరిశ్రమలో ఒక టాక్. ఎందుకంటే ఈ సినిమా రెండో పార్టు లో అల్లు అర్జున్ విశ్వరూపం చూస్తారని, అలాగే సుకుమార్ ఈ రెండో పార్టు మీద విశేషంగా వర్క్ చేసాడని కూడా అంటున్నారు. అందుకని ఈ ఇద్దరూ కలిసి చాలా హోమ్ వర్క్ చేసి షూటింగ్ కి వెళ్లారని, అందుకని ఈ సినిమా అర్జున్, సుకుమార్ ఇద్దరికీ చాల మంచి పేరు తీసుకు రావటమే కాకుండా ఈ సినిమా చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. (Both director Sukumar and Allu Arjun did lot of home work before going for the shoot)

Updated Date - 2023-01-20T15:37:13+05:30 IST