Shocking: అమ్మబాబోయ్.. ఇవేంటి..? సముద్రం ఒడ్డున గుట్టలుగుట్టలుగా పడి ఉన్న వింత జీవులు.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..!

ABN , First Publish Date - 2023-05-16T20:16:37+05:30 IST

న్యూజిలాండ్ సముద్ర తీరంలో ఇటీవల కనిపించిన ఓ వింత ఆకారం నెటిజన్లను భయపెడుతోంది. భారీ చెక్క దుంగపై పెద్ద పెద్ద వానపాముల్లాంటి ఆకారాలు అతుక్కుని ఉన్నట్టు కనిపించిందా ఆకారం. దీన్ని చూసిన కొందరు ఏలియన్ అని కూడా అనుమానిస్తున్నారు. ఈ ఆకారం ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Shocking: అమ్మబాబోయ్.. ఇవేంటి..? సముద్రం ఒడ్డున గుట్టలుగుట్టలుగా పడి ఉన్న వింత జీవులు.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..!

ఇంటర్నెట్ డెస్క్: సముద్ర గర్భంలో ఏం దాగుందో మానవుడికి ఇప్పటికీ తెలీదు. అందుకే, సముద్రం ఒడ్డుకు తరచూ కొట్టుకొచ్చే వింత ఆకారాలను చూసి భయపడిపోతుంటారు. వీటిని చూసి కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తలు కూడా షాకయిపోతుంటారు. తాజాగా న్యూజిలాండ్(New Zealand) సముద్రం ఒడ్డున కనిపించిన ఓ వింత ఆకారాన్ని చూసి స్థానికులు భయపడిపోయారు. ఆ వింత ఆకారాల ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్‌ సముద్రం ఒడ్డున ఇవి తొలిసారిగా కనిపించాయి. ఓ పెద్ద స్తంభంపై భారీ వానపాముల్లాంటి వింత ఆకారాలు అతుక్కున్నట్టు ఆ వింత జీవి ఉంది. స్థానికంగా నివసించే కేలా మోర్మన్ వీటిని తొలిసారిగా గుర్తించింది. ఇటీవల ఓ రోజు ఉదయం సముద్ర తీరంలో వాకింగ్‌కు వెళ్లిన ఆమె వీటిని చూసింది. దాదాపు అయిదున్నర అడుగుల పొడవున్న స్తంభంపై(Log) వానపాముల్లాంటివి అతుకున్నట్టు ఆమెకు అనిపించింది. వీటిని చూడగానే ఆశ్చర్యంతో పాటూ ఆమె ఒళ్లు జలదరించింది. అది గ్రహాంతర వాసి(Alien) అయి కూడా ఉండొచ్చని ఆమె అనుమానించింది.

ఆ తరువాత మహిళ చివరకు స్థానిక మెరైన్ బయాలజీ శాస్త్రవేత్తలకు సమాచారం అందించింది. అయితే, ఈ ఫొటోలు చూసిన వారందరూ సముద్రంలో నివసించే అనేక పరాన్న జీవుల్లో ఇవీ ఒకటి అయి ఉంటాయని చెబుతున్నారు. పెద్ద చెక్క దుంగ లాగా ఉన్న మరో జీవి మీద వానపాముల్లాగా కనిపిస్తున్న ఆకారాలు అతుకున్నాయని అంటున్నారు. ఈ ఫొటో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - 2023-05-16T20:21:38+05:30 IST