Alia Siddiqui: మోసంతో.. అతని అసలు రంగు బయటపడింది!

ABN , First Publish Date - 2023-02-11T12:46:06+05:30 IST

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్థిఖీ కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఆయన మంచివాడు కాదంటూ సిద్ధిఖీ భార్య ఆలియా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాజుద్దీన్‌తోపాటు అతడి తల్లి మానసికంగా వేధింపులకు గురి చేశారని మీడియా ముందు చెప్పారు.

 Alia Siddiqui: మోసంతో.. అతని అసలు రంగు బయటపడింది!

బాలీవుడ్‌ విలక్షణ (Bollywood artist)నటుడు నవాజుద్దీన్‌ సిద్థిఖీ (Nawazuddin Siddiqui) కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఆయన మంచివాడు కాదంటూ సిద్ధిఖీ భార్య ఆలియా ( Alia Siddiqui) ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాజుద్దీన్‌తోపాటు అతడి తల్లి మానసికంగా వేధింపులకు గురి చేశారని మీడియా ముందు చెప్పారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. దానితో నవాజ్‌కు, ఆమెకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ‘‘భార్యను మనిషిలా చూడలేని ఓ వ్యక్తికి నా జీవితంలో 18 సంవత్సరాలు కేటాయించినందుకు ఎంతో చింతిస్తున్నాను. అతని చూపులో కూడా నా మీద విలువ కనిపించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోతోపాటు ఓ లేఖను పోస్ట్‌ చేశారు ఆలియా. ‘‘2004లో మొదటిసారి సిద్ధిఖీ కలిశాను. అప్పట్లో నేనూ, నవాజ్‌, ఆయన సోదరుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. కొంతకాలానికి నేను, నవాజుద్దీన్‌ చాలా దగ్గరయ్యాం. తను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని నమ్మాను. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ సమయంలో నవాజ్‌కు సంపాదన లేదు. దాంతో నేనూ, ఆయన సోదరుడు కలిసే ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చాను. మా అమ్మ ఇచ్చిన ప్లాట అమ్మి డెలివరీ ఖర్చులు చూసుకుని, అతనికి కారు గిఫ్ఠ్‌గా ఇచ్చాను. ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. తానొక మనిషి అని మరచిపోయాడు. మానవత్వం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. నిజాయతీగా చెప్పాలంటే అతడేమీ మంచి వాడు కాదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేశానని ప్రచారం చేశాడు. అతని మాటలు మానసికంగా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ( Alia Siddiqui viral post on Nawazuddin Siddiqui)

అంతే ఇంట్లో పిల్లలకు కూడా ప్రైవసీ లేకుండా చేస్తున్నాడు. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన నా బిడ్డల్ని బెడ్‌రూమ్‌లోకి రానివ్వకుండా హాల్‌కే పరిమితం చేశాడు. సోఫాలో పడుకునే స్థితికి తీసుకొచ్చాడు. మా చుట్టూ సెక్యూరిటీ పెట్టాడు. బయటి వాష్‌రూమ్‌ ఉపయోగించుకోవలసిన పరిస్థితి. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడటం లోనే మనిషి రంగు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అతని అసలు రంగు బయటపడుతోంది. మంచి పెంపకంలో పెరిగినవాడు ఎప్పుడూ మోసాలు చేయడు’’ అని ఆలియా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించిన నవాజుద్దీన్‌ సిద్ధికీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సైంధవ్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Updated Date - 2023-02-11T12:47:22+05:30 IST