Akkineni Akhil: ‘ఏజెంట్’ విడుదల తేదీ ఖరారు!

ABN , First Publish Date - 2023-02-04T15:08:28+05:30 IST

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది.

Akkineni Akhil: ‘ఏజెంట్’ విడుదల తేదీ ఖరారు!

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పండగ సందర్భంగా అనేక చిత్రాలు విడుదల అవుతుండటంతో బరి నుంచి ఈ చిత్రం తప్పుకొంది. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తాజాగా మేకర్స్ తెలిపారు.

‘ఏజెంట్‌’ విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోయిన్‌గా కూడా ఆమెకు ఇదే మొదటి చిత్రం. అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) లో చివరగా కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘ఏజెంట్’ ను పట్టాలెక్కించారు.

Updated Date - 2023-02-04T15:09:41+05:30 IST