SamanthaRuthPrabhu: చాల నెలల తరువాత సమంత మొదటి సారి ప్రెస్ ముందుకు

ABN , First Publish Date - 2023-01-08T17:39:19+05:30 IST

సమంత ఈ సినిమా గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత ఏమి పోస్ట్ చేసిన అది వైరల్ అవటం సహజం, అయితే ఇది కొంచెం భావోద్వేగాలతో కూడిన పోస్ట్ అవటం వలన మరింత వైరల్ అయింది.

SamanthaRuthPrabhu: చాల నెలల తరువాత సమంత మొదటి సారి ప్రెస్ ముందుకు

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆమె యధాలాపంగా, పూర్వంలా కనిపిస్తూ ఇప్పుడు బయటకి వస్తోంది. మొన్నటికి మొన్న ఒక ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ చాలామందికి కనిపించింది, కొంతమందికి సెల్ఫీ కూడా ఇచ్చింది. సమంత టోటల్ గా ఆరోగ్యవంతురాలిగా బయటకి వచ్చింది. మయోసిటిస్ (Myositis) వ్యాధి బారిన పడిన సమంత కొన్నాళ్ల పాటు అన్నిటికీ దూరంగా కనపడకుండా చాలా బాధలు పడింది. ఇప్పుడు మళ్ళీ బయటకి వచ్చి, తన సినిమా 'శాకుంతలం' ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్టు తెలిసింది. అయితే సమంత ఈ సినిమా గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత ఏమి పోస్ట్ చేసిన అది వైరల్ అవటం సహజం, అయితే ఇది కొంచెం భావోద్వేగాలతో కూడిన పోస్ట్ అవటం వలన మరింత వైరల్ అయింది. (One post from Samantha on her Instagram is going viral on social media)

ఇంతకీ ఆ పోస్ట్ లో వున్నా సారాంశం ఏమిటి అంటే, 'శాకుంతలం' సినిమాలో కష్టమయిన పని ఏంటి అంటే, ఒకే రకం అయినా భావం కనిపించేటట్టు ఉండటం, నడుస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, పరిగెడుతున్నప్పుడు కూడా. అలంటి ఒక స్టైల్ ఇవ్వటం తన వాళ్ళ కాలేదు అని, అందుకని దానికోసమని ఒక ప్రత్యేకమయిన శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. శకుంతల, విశ్వామిత్ర కి మేనకకి పుట్టిన కూతురు. దుశ్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహం చేసుకొని, ఆమెతో కొన్నాళ్ళు అక్కడే వుండి, ఆమెని తీసుకువెళతానని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. శకుంతల ఏ విధంగా భర్త దగ్గరికి వెళ్లి ఏ విధంగా పోరాడి తాను దుశ్యంతుడు భార్య ని అని ప్రపంచానికి ఎలా చెప్పింది అనేది ఒక ధీరోదాత్తమయిన పాత్ర. అలంటి పాత్ర వేయాలంటే నిజంగా సమంత చాల కష్టపడాలి, ఆ పాత్ర స్వభావం కూడా తెలుసుకోవాలి.

sam3.jpg

సోమవారం నుండి గుణశేఖర్ (Director Gunasekhar) దర్శకత్వం లో ఫిబ్రవరి 17న (February 17) విడుదల సిద్ధంగా వున్న ఈ 'శాకుంతలం' (Shakuntalam) సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. సోమవారం మొదటిది కాగా, దీనికి సమంత కూడా హాజరు అవుతున్నట్టుగా ఆ సినిమా పి.ఆర్. టీం అందరికీ సందేశాలు కూడా పంపింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు, అతను కూడా హాజరు అవుతున్నాడు. (Samantha is going to appear in her first cinema press meet on Monday)

Updated Date - 2023-01-08T17:40:02+05:30 IST