Naveen Chandra: తండ్రైన నవీన్‌ చంద్ర.. చిన్నారి కాలుని ముద్దాడుతూ..!

ABN , First Publish Date - 2023-02-22T23:43:12+05:30 IST

హీరోగా నటిస్తూనే.. విలక్షణ పాత్రలను సైతం చేస్తూ మెప్పిస్తున్న హీరో నవీన్‌ చంద్ర (Hero Naveen Chandra). ఆయన రీసెంట్‌గా తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ..

Naveen Chandra: తండ్రైన నవీన్‌ చంద్ర.. చిన్నారి కాలుని ముద్దాడుతూ..!
Hero Naveen Chandra Blessed with Baby Boy

హీరోగా నటిస్తూనే.. విలక్షణ పాత్రలను సైతం చేస్తూ మెప్పిస్తున్న హీరో నవీన్‌ చంద్ర (Hero Naveen Chandra). ఆయన రీసెంట్‌గా తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ.. నెలలు నిండిన తన భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన భార్య ఓ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చినట్లుగా తాజాగా ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. దీంతో నవీన్ చంద్ర ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.

‘‘నేను, ఓర్మా.. మగ బిడ్డతో ఆశీర్వదించబడ్డాము’’ (Me and orma ❤️ Blessed with baby boy 👶!!!!❤️) అని తెలుపుతూ.. పుట్టిన చిన్నారితో ఉన్న ఫొటోలను నవీన్ చంద్ర షేర్ చేశారు. ఇందులో చిన్నారి కాలుని ఆయన ముద్దాడుతున్నారు. ఆయన కళ్లలో ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రస్తుతం నవీన్ చంద్ర షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నవీన్ చంద్ర (Actor Naveen Chandra) ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘నేను లోకల్’ (Nenu Local), ‘అరవింద సమేత వీరరాఘవ’ (Aravinda Sametha Veera Raghava)లో వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును పొందారు. ప్రస్తుతం ఆయన సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ నటిస్తూ బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. హీరోగా నవీన్ చంద్ర ఓ బై లింగ్విల్ మూవీ చేస్తుండగా.. ఇందులో అమృతా అయ్యర్, వాణీ భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం


Updated Date - 2023-02-22T23:43:13+05:30 IST