Viral Video: డ్రైనేజీ హోల్స్‌లోంచి బయటకు వచ్చిన పాము.. రోడ్డు దాటేందుకు ఎన్ని తిప్పలు పడిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-30T19:39:46+05:30 IST

డ్రైనేజీ హోల్స్‌లోంచి బయటకు వచ్చిన పాము.. వైరల్ వీడియో..

Viral Video: డ్రైనేజీ హోల్స్‌లోంచి బయటకు వచ్చిన పాము.. రోడ్డు దాటేందుకు ఎన్ని తిప్పలు పడిందో మీరే చూడండి..!

ఇంటర్నెట్ డెస్క్: పాముల్లో విషపూరితమైనవే కాదు విషరహితమైనవీ ఉంటాయి. అయితే.. పాముల పేరు చెబితే చాలా ఎవ్వరైనా దడుసుకోవాల్సిందే. పాముల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాం కానీ.. వాటి పేరు చెబితే మాత్రం అనేక మంది బెదిరిపోతారు. అందుకే..సోషల్ మీడియాలో పాముల వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది(Viral Video).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. వాహనాలతో రద్దీగా ఉన్న ఓ వీధిలోని డ్రైనేజీ హోల్ నుంచి అకస్మాత్తుగా ఓ పాము బయటకు వచ్చింది(Snake in the middle of the Road). ఇంతెత్తున లేచి ఒకటి రెండు సార్లు బుస కూడా కొడుతుంది. వాహనాల రద్దీకి కాస్తంత టెన్షన్ పడ్డ ఆ పాము రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే..అది ముందుకు వెళ్లే క్రమంలో ఓ భారీ కారు వేగంగా దాని ముందు నుంచి వెళ్లింది. కారు టైర్ల కింద పడి నలిగిపోవాల్సిన పాము తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకుంది. ఇలా రోడ్డు దాటేందుకు నానా తిప్పలు పడ్డ పాము చివరకు రిస్క్ వద్దనుకుని వెనుదిరిగింది.

వీడియో అక్కడితోనే ముగియడంతో ఆ తరువాత ఏమైందనే దానిపై క్లారిటీ లేదు. అయితే.. ఈ దృశ్యాలకే నెటిజ్లను బెంబేలుపడిపోతున్నారు. ఇప్పటివరకూ లక్ష మంది ఈ వీడియోను చూశారంటే ఈ వీడియోపై నెటిజన్లు ఎంతగా ఆకర్షితులవుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతగా వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓమారు లుక్కేస్తే పోలా..!

Updated Date - 2023-03-30T19:39:46+05:30 IST