ఆఫీసు పనిలో మునిగిపోయి ఈ తప్పు మాత్రం చేయకండి.. వైద్యుల హెచ్చరిక

ABN , First Publish Date - 2023-03-19T20:02:37+05:30 IST

గంటలు గంటలు ఆఫీసులో కూర్చుని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

ఆఫీసు పనిలో మునిగిపోయి ఈ తప్పు మాత్రం చేయకండి.. వైద్యుల హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఉద్యోగుల పనితీరులో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా.. కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాక గంటల తరబడి వాటి ముందు కూలబడి పనిచేయాల్సి వస్తోంది. పని ధ్యాసలో పడి అనేక మంది ఉద్యోగులు కుర్చీల్లో గంటల తరబడి కదలకుండా కూర్చుండిపోతారు. కానీ.. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. నిరంతరం కూర్చీల్లో కూర్చునే పనిచేయడం వల్ల త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. హార్ట్ ఎటాక్, క్యాన్సర్, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడతారు. ఇలాంటి శారీరక సమస్యలు మానసికంగా కూడా దెబ్బతీస్తాయి.

రోజంతా కుర్చీలకు అంటుకుపోయి ఉండటం వల్ల లిపోప్రొటీన్ లైపేస్ విడుదల కాదట. ఫలితంగా బరువు పెరిగి చివరకు ఊబకాయం వస్తుందని వైద్యులు చెబుతారు.

రోజంతా ఆఫీసులోనే ఉన్నా సాయంత్రానికి నీరసంగా అనిపిస్తోందా? అధిక సమయం కూర్చుంటే వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటిని డాక్టర్లు చెబుతున్నారు. నిత్యం యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి నిరసాలు అస్సలు దరిచేరవని చెబుతున్నారు.

ఇక పనిలో పడిపోయి కొందరు ముందుకు వంగి మరీ పనిచేస్తుంటారు. ఇదీ అనర్థదాయకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెన్ను నిటారుగా ఉండేలా సరైన పద్ధతిలో కూర్చోని పక్షంలో వెన్ను నొప్పి మొదలవుతుంది. ఇది జీవితకాలం వెంటాడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే అప్పుడప్పుడూ కుర్చీలోంచి చేసి రెండు నిమిషాలు నడవాలని, బాడీని స్ట్రెచ్ చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-03-19T20:03:41+05:30 IST