Viral Video: ఎలా వస్తాయయ్యా బాబూ.. ఇలాంటి వెరైటీ ఐడియాలు.. సీసీటీవీ కెమెరాను ఇలా కూడా మార్చొచ్చా..?
ABN , First Publish Date - 2023-09-04T18:40:16+05:30 IST
360 డిగ్రీ కెమెరా ఖరీదైనది కావడంతో సాధారణ సీసీటీవీ కెమెరాను టేబుల్ ఫ్యానుపై పెట్టి సమస్యను పరిష్కరించాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ చోట సీసీటీవీ కెమెరాకు చేసిన మార్పులు చూసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. ఎలా వస్తాయయ్యా బాబూ ఇలాంటి ఐడియాలు అంటూ షాకయిపోతున్నారు. అందుకే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటూ తెగ వైరల్(Viral Video) అవుతోంది.
ఇంతకీ జరిగిందేంటంటే.. గది మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. దీనికి ఇప్పటికే అత్యాధునిక కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. దాన్ని 360 సీసీటీవీ కెమెరాలు అని అంటారు. అయితే, ఇవి కొద్దిగా ఖరీదైనవి. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ఈ సమస్యకు చాలా చవకైన పరిష్కారం కనిపెట్టాడు.
ఇందు కోసం అతడు టేబుల్ ఫ్యాన్ ఇంజిన్‌పై సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడు(CCTV Camera attached to fan). దీంతో, ఫ్యాన్ ఆన్ చేయగానే అది అటూ ఇటూ తిరగడంతో దానిపై ఉన్న కెమెరాలో చుట్టూ ఉన్న ప్రాంతమంతా రికార్డైపోయింది. ఖర్చు తగ్గించేందుకు అతడి ఐడియా జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ వీడియో బాాగా వైరల్ అవుతోంది.
వరల్డ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో తొలిసారిగా ఈ వీడియో దర్శనమిచ్చింది. ఇది జనాలకు విపరీతంగా నచ్చడంతో కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులకు తెలిసినన్ని చిట్కాలు మరెవ్వరికీ తెలియవేమో అని అనేక మంది ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ ఐడియాతో కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందని కొందరు కామెంట్ చేశారు.