చలితో జాగ్రత్త.. గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిన 24 ఏళ్ల యువకుడు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2023-01-17T15:51:57+05:30 IST

ఆ యువకుడి వయసు 24 ఏళ్లు.. స్నేహితులతో కలిసి గిల్లీ దందా (బిల్లా కర్ర) అడేందుకు మైదానంలోకి వెళ్లాడు.. మైదానంలో పరిగెడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు..

చలితో జాగ్రత్త.. గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిన 24 ఏళ్ల యువకుడు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ఆ యువకుడి వయసు 24 ఏళ్లు.. స్నేహితులతో కలిసి గిల్లీ దందా (బిల్లా కర్ర) అడేందుకు మైదానంలోకి వెళ్లాడు.. మైదానంలో పరిగెడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు.. ఆ యువకుడు గుండెపోటుతో (Heart Attack) మరణించినట్టు డాక్టర్లు చెప్పారు.. ఒక నెలలో గ్వాలియర్ (Gwalior) నగరంలో చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన నాలుగో వ్యక్తి ఆ యువకుడు కావడం విషాదం. కాగా, గ్వాలియర్‌లో గత 24 గంటల్లో చలి కారణంగా వచ్చిన గుండెపోటు వల్ల ఐదుగురు మరణించారు (Madhya Pradesh News).

నాజుల్ కాలనీలో నివాసం ఉంటున్న రిషి ఓజా (24) బైక్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం రిషి తన స్నేహితులతో కలిసి గ్రౌండ్‌లో గిల్లి దందా ఆడేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆడుకుంటుండగా ఒక్కసారిగా నేలపై పడిపోయాడు (Youth fell while playing). స్నేహితులు రిషిని ఎత్తుకుని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రిషి చనిపోయినట్టు డాక్టర్ ప్రకటించారు. సోమవారం ఉదయం రిషి మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. చిన్న వయసులోనే గుండెపోటుకు గురై రిషి చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

గ్వాలియర్ డివిజన్ పరిధిలో తీవ్రమైన చలి (Cold) ఉంది. సోమవారం రాత్రి ఉష్ణోగ్రత 4.4 డిగ్రీలుగా నమోదైంది. రోజు ఉష్ణోగ్రత కూడా 20 డిగ్రీల కంటే తక్కువగానే ఉంటోంది. చలిలో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. వరుసగా మరణాలు సంభవిస్తుండడంతో ఉదయం పూట అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-01-17T15:51:59+05:30 IST