18 Pages OTT Streaming: ఓటీటీకి వచ్చేస్తున్న నిఖిల్ మూవీ.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2023-01-15T10:35:55+05:30 IST

గతేడాది పాన్ ఇండియా స్థాయి మంచి విజయాన్ని దక్కించుకున్న సినిమాల్లో ‘కార్తీకేయ 2’ (Kathikeya 2) ఒకటి. యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌..

18 Pages OTT Streaming: ఓటీటీకి వచ్చేస్తున్న నిఖిల్ మూవీ.. ఎక్కడంటే..
18 Pages

గతేడాది పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని దక్కించుకున్న సినిమాల్లో ‘కార్తీకేయ 2’ (Kathikeya 2) ఒకటి. యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama parameshwaran) జంటగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా దాదాపు రూ.120 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages). గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా సక్సెస్‌ని అందుకుంది. విడుదలైన మొదటి ఆట నుంచే మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) స్టోరీ అందించిన ఈ మూవీ మొత్తంగా రూ. 25 కోట్లపైనే గ్రాస్‌ కలెక్ట్‌ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

nikhil.jpg

బిగ్‌స్క్రీన్‌పై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం త్వరలో ఓటీటీ సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ఇంతకుముందే ఈ ఆహా వీడియో సొంతం చేసుకుంది. తాజాగా మరో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీ భారీ ధరకు ఈ చిత్ర రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి తెలుపుతూ.. నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం సోషల్ మీడియా ఓ పోస్ట్ చేసింది. దానికి.. ‘పేజ్‌లు 18 అయినా, మినిమం 18 సార్లు చూడటానికి సిద్ధం. త్వరలో 18 పేజేస్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది’ అని రాసుకొచ్చింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2023-01-15T10:38:47+05:30 IST