Bank holidays in October 2023: బ్యాంకు ఖాతాదారులూ.. బీ అలెర్ట్.. అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు సెలవులే..!
ABN , First Publish Date - 2023-09-29T18:25:26+05:30 IST
అన్ని రాష్ట్రాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అక్టోబర్ నెలలో మొత్తం16 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ నెల రేపటితో ముగిసిపోతుంది. కొత్త నెలలో కాలుపెడుతున్నాం కాబట్టి అక్టోబర్‌లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవలో (Bank Holidays) తప్పసరిగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చివరి నిమిషంలో పనుల్లో జాప్యం జరిగి అనవసరంగా టెన్షన్ పడిపోవాల్సి వస్తుంది. బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్న నెలల్లో మరింత జాగరూకతతో ఉండటం అవసరం.
ఇక వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో చెబుతూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఓ క్యాలెండర్ విడుదల చేసింది. దీని ప్రకారం, వచ్చే నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులు మూసివేస్తారు. అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులన్నీ యథాతథంగా అమలు చేయకపోయినప్పటికీ సెలవుల గురించి ఓ అవగాహన ఏర్పరుచుకుంటే ఇబ్బందులు తలెత్తవు. అక్టోబర్ నెల మొదటి రోజే ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆర్బీఐ ప్రకటన ప్రకారం..
అక్టోబర్ 1,8,15,22,29 - ఆదివారాలు సెలవు
అక్టోబర్ 14,28 - రెండు, నాలుగో శనివారం సెలవు
అక్టోబర్ 2- గాంధీ జయంతి
అక్టోబర్ 18 - కటి బిహూ (గువహటీలో సెలవు)
అక్టోబర్ 21 - దుర్గా పూజ (అగర్తల, గువహటి, ఇంపాల్, కోల్‌కతాల్లో సెలవు)
అక్టోబర్ 23 - దుర్గా పూజ
అక్టోబర్ 24 - విజయదశమి
అక్టోబర్ 25 - దుర్గాపూజ; గాంగ్య్‌టాక్‌లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 26 - దుర్గాపూజ; గ్యాంగ్‌టాక్, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 27 - దుర్గాపూజ; గ్యాంగ్‌టాక్‌లో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 28 - లక్ష్మీ పూజ; కోల్‌కతాలో సెలవు