Share News

Viral: చేయి లేకుండా పుట్టిన 10 ఏళ్ల కుర్రాడికి భలే క్రిస్మస్ గిఫ్ట్! ఇంతకంటే గొప్ప బహుమతి మరోటి ఉండదేమో!

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:10 PM

మనిషిని వేధిస్తున్న అనేక సమస్యలకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను అందిస్తోంది. తాజాగా ఓ 10 ఏళ్ల కుర్రాడి జీవితంలో ఇలాంటి అద్భుతమే జరిగింది.

Viral: చేయి లేకుండా పుట్టిన 10 ఏళ్ల కుర్రాడికి భలే క్రిస్మస్ గిఫ్ట్! ఇంతకంటే గొప్ప బహుమతి మరోటి ఉండదేమో!

ఇంటర్నెట్ డెస్క్: మనిషిని వేధిస్తున్న అనేక సమస్యలకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను అందిస్తోంది. తాజాగా ఓ 10 ఏళ్ల కుర్రాడి జీవితంలో ఇలాంటి అద్భుతమే జరిగింది. క్రిస్మస్‌ సందర్భాన్ని పురస్కరించుకుని అతడికి వచ్చిన ఈ బహుమతి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

బ్రిటన్‌‌లోని లాంకషైర్‌కు చెందిన హ్యారీ జోన్స్ ఓ చేయి లేకుండా పుట్టాడు. అతడి కుడి మోచేయి కింది బాగం లేదు. అయితే, అందరి పిల్లల్లా సాధారణ జీవితం గడపాలనేది అతడి చిరకాల కోరిక. ఈ క్రిస్మస్ సందర్భంగా అతడి కోరిక నెరవేరింది. సాధారణ జీవితం గడిపేందుకు ఉపకరించే అత్యాధునిక బయోనిక్ చేయిని తాజాగా అతడికి అమర్చారు.

హ్యారీకి నచ్చిన ఐరన్ మ్యాన్ సూపర్ హీరో సూట్ మాదిరిగా దీన్ని రూపొందించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ కొత్త చేయి సౌకర్యవంతంగా ఉండటంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది (10-Year-Old Receives 'Iron Man'-Themed Bionic Arm In UK). ఓపెన్ బయానిక్స్ అనే సంస్థ ఈ కృత్రిమ చేయిని తయారు చేసింది. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆర్థికసాయం అందించింది. ఈ తరహా కృత్రిమ చేయి పొందిన అతికొద్ది మంది వ్యక్తుల్లో హ్యారీ కూడా ఒకడిగా నిలిచాడు.


ఏమిటీ బయోనిక్ ఆర్మ్..

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బయోనిక్ ఆర్మ్ సాధారణ చేయిని పోలి ఉంటుంది. దీంతో, వస్తువులను పట్టుకోవడం, పైకిలేపడం వంటివి చేయచ్చు. చేతిలో కండరాల్లోని కదలికలను బయోనిక్ ఆర్మ్ గుర్తించి అందుకు అనుగుణంగా కదులుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మనసులో చేయిని కదుపుతున్నట్టు భావిస్తే అందుకు అనుగుణంగా చేయి కదులుతుందన్న మాట.

Updated Date - Dec 17 , 2023 | 08:16 PM