TS Politics : ప్రధాని మోదీ పాలమూరు సభకు దూరంగా బీజేపీ ముఖ్య నేతలు.. ఏదో తేడా కొడుతోందే..?

ABN , First Publish Date - 2023-10-01T23:00:14+05:30 IST

అవును.. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు..

TS Politics : ప్రధాని మోదీ పాలమూరు సభకు దూరంగా బీజేపీ ముఖ్య నేతలు.. ఏదో తేడా కొడుతోందే..?

అవును.. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు సభలో ఎక్కడా కనిపించలేదు. ఈ నేతల గైర్హాజరు గురించే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీరంతా బీజేపీ హైకమాండ్‌పై అలకబూనినట్లు తెలియవచ్చింది. పార్టీలో కొత్తవారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తూ.. తమను అధిష్టానం అస్సలు పట్టించుకోవట్లేదన్నది ఈ నేతల అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే.. ఇక కేంద్రం నుంచి ఎంత పెద్దోళ్లు వచ్చినా సరే కలవడం, సభకు హాజరుకావడం లాంటి వాటికి దూరంగా ఉండాలని ఈ ముఖ్యనేతలంతా నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే ఇవాళ పాలమూరు సభకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది.


Modi-Bye.jpg

తాడోపేడో..!?

ఈ మధ్యే అసంతృప్త నేతలంతా అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమై.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో ఈ భేటీ అయిన తెలిసిందే. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం వైఖరిపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల ‘బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటే’ అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని వారు అభిప్రాయపడ్డారు. ‘ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులంతా బీజేపీ వైపు మొగ్గుచూపారు. అయితే, వారిని పార్టీ దూరం చేసుకుంటోంది. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అధినాయకత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది.. అయినా ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుచిక్కడం లేదు’ అని ఒకరిద్దరు నేతలు అన్నట్లు తెలిసింది. అధిష్ఠానం స్పందన కోసం రెండు, మూడు రోజులు వేచి చూడాలని, ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అధినాయకత్వం వైఖరి స్పష్టం కాకపోవడంతో అసంతృప్త సీనియర్లు వరుస భేటీలు నిర్వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Modi-Sabha-2.jpg

ఎటూ తేలకపోవడంతో..!

వాస్తవానికి.. మోదీ పాలమూరు రాకముందే తాడోపేడో తేలిపోతుందని ఈ ముఖ్యనేతలు భావించినప్పటికీ ఇంతవరకూ తేలలేదట. అందుకే ఇక తమ సమస్యలు, తమ డిమాండ్లు నెరవేర్చనప్పుడు ఇక.. ‘మన అవసరం పార్టీకి.. పార్టీ అవసరం మనకు లేదు’ లేదనే భావనలో ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ సైతం జరుగుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్‌లోకి వెళ్లారని.. మరోవైపు విజయశాంతి, వివేక్‌లు కూడా సొంత గూటికి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఆ మధ్య మర్రిగూడ పర్యటనలో పార్టీ మార్పుపై రాజగోపాల్ స్వయంగా చేసిన కామెంట్స్‌కు.. ఇప్పుడు మోదీ సభకు రాకపోవడానికి లింకులు పెట్టి మరీ.. చర్చకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎంపీ.. సోయం బాపూరావు సభకు రాకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేతలంతా కలిసి.. ఫైనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎటువైపు అడుగులేస్తారో చూడాలి మరి.

Modi-Sabha-1.jpg


ఇవి కూడా చదవండి


Lokesh On CBN Arrest : చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయా.. చాలా బాధగా ఉంది!


Pawan Vs Jagan : సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ చేసి.. సలహా ఇచ్చిన పవన్


Pawan Kalyan : జగన్ రాసిపెట్టుకో.. మీరు ఓడిపోవటం ఖాయం!Updated Date - 2023-10-01T23:04:28+05:30 IST