#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

ABN , First Publish Date - 2023-02-19T21:59:14+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న తిరిగిరానిలోకాలకు చేరుకోవడంతో అభిమానులు (Fans) , కార్యకర్తలు (Activists) శోకసంద్రంలో మునిగిపోయారు...

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న తిరిగిరానిలోకాలకు చేరుకోవడంతో అభిమానులు (Fans) , కార్యకర్తలు (Activists) శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజా జీవితంలో ఉండాలనుకున్న తారకరత్న ఆ ఆశ తీరకుండానే ప్రాణాలు వదలడాన్ని నందమూరి, టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న చాలా మంచి మనిషని.. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, గర్వం లేని వ్యక్తని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి తిరిగిన రోజులను గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) షేర్ చేస్తున్నారు. రాజకీయాల్లోకి (Politics) రావాలని తారకరత్న భావించిన తర్వాత టీడీపీ (TDP) తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా కచ్చితంగా వెళ్లి హాజరయ్యేవారు. ముఖ్యంగా టీడీపీ ముఖ్య నేతల వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అంతేకాదు.. తాత నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramaro) విగ్రహావిష్కరణ కూడా తారకరత్న చేతుల మీదుగానే జరిగింది.

Paritala-Sri-Ram-and-Taraka.jpg

ఇంతకీ ఏమిటా వీడియో..!

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న తారకరత్న వీడియోల్లో ఓ వీడియోను చూసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెడుతున్నారు. ఒక్క అభిమానులే కాదు ఈ వీడియోను సాధారణ వ్యక్తులు ఎవరూ చూసినా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆ వీడియోలోని ఫొటోలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సాంగ్‌ను చూస్తే కచ్చితంగా ఎంత కఠిన మనిషికైనా బాధ కలుగుతుంది. వీడియో విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరి 24న పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం జరిగింది. తారకరత్నకు పిలుపు రావడంతో హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లా వెంకటాపురంకు వెళ్లారు. పరిటాల రవి ఘాట్ (Paritala Ravi Ghat) దగ్గర శ్రీరామ్, సునీతతో (Paritala Sri Ram, Sunitha) కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నివాళులు అర్పించిన తారకరత్న.. ‘జోహార్ పరిటాల.. అమర్ రహే రవన్న’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అప్పట్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Taraka-ddd.jpg

హార్ట్ బ్రేకయ్యేలా కామెంట్స్..!

తారకరత్న మరణంతో ఇప్పుడు ఈ వీడియోను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘సూర్యుడే సెలవని అలసిపోయేనా..’ అనే సాంగ్‌ను జత చేయడంతో వేలాది మంది నెటిజన్లు చూశారు. ఇందులో పరిటాల ఘాట్ దగ్గర శ్రీరామ్ పలువురు నేతలను తారకరత్నకు పరిచయం చేస్తున్నట్లుగా ఉంది. పరిటాల కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు, వారితో కలిసి నడుస్తున్నట్లు ఫొటోలు, కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చే ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హార్ట్ బ్రేక్ అయినట్లు ఉన్న ఎమోజీలను కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ‘జోహార్ తారకరత్న..’ అంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Taraka-2.jpg

కాగా.. ఆదివారం నాడు మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ ఇద్దరూ తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తారకరత్న తల్లిదండ్రులు, అలేఖ్యారెడ్డి, పిల్లలను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో శ్రీరామ్ పోస్ట్ చేశారు. మొత్తానికి చూస్తే.. పరిటాల శ్రీరామ్ పోస్ట్ చేసిన ఒకే ఒక్క వీడియో నందమూరి అభిమానులు కదిలించేసింది.

Paritala-02.jpg
**********************************

ఇవి కూడా చదవండి..

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-19T22:15:59+05:30 IST