Share News

CBN Jail : పెన్ కెమెరా, గంజాయి.. చంద్రబాబు కంటి ఆపరేషన్‌, భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ ఏమన్నారో వింటే..

ABN , First Publish Date - 2023-10-27T22:55:29+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ జడ్జికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని కొందరు చెబుతుండగా..

CBN Jail : పెన్ కెమెరా, గంజాయి.. చంద్రబాబు కంటి ఆపరేషన్‌, భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ ఏమన్నారో వింటే..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ జడ్జికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని కొందరు చెబుతుండగా.. అబ్బే అస్సలు కానేకాదని మరికొందరు చెబుతున్న పరిస్థితి. అయితే.. ఆ లేఖలో చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, పెన్ కెమెరా, గంజాయి.. ఇలా పలు విషయాలు మూడు పేజీల్లో అన్ని విషయాలను నిశితంగా రాసుకొచ్చినట్లు ఉంది. ఈ లేఖలో నిజమెంత..? ఇందులోని విషయాలు ఎంతవరకు నిజం..? అనేదానిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.


jail Of.jpeg

ఇదిగో ఏమన్నారో చూడండి..

  • చంద్రబాబు జడ్జి గారికి రాసి ఇచ్చిన లేఖను సీల్డ్ కవర్లో కోర్టుకు పంపించాం

  • మావోయిస్టుల లేఖ అంటూ వచ్చిన దానిపై జిల్లా ఎస్పీ జైలుకు వచ్చి పరిశీలించారు

  • ఎస్ కోట నుంచి వచ్చిన శ్రీనివాస చక్రవర్తి అనే ఖైదీ బట్టల్లో బటన్ కెమెరా ఉంది

  • ఆ కెమెరాను జైలు లోపలికి తీసుకొని రాలేదు. అందులో ఎటువంటి జైలు ఫుటేజ్ లేదు

  • జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి.

  • 23న జైలు పరిసరాల్లో డ్రోన్ కెమెరా వచ్చిందని గార్డ్ ఇచ్చిన సమాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం

  • మరొక డ్రోన్ కెమెరా ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులను ఫోటో తీశారు అనే సమాచారం మా దగ్గర లేదు

భద్రతపై..

  • జైలు లోపలికి గంజాయి విసిరారు అనేది అబద్దం

  • జైలు పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాం

  • చంద్రబాబు భద్రత విషయంలో తేడా వస్తే తర్వాత పరిణామాలు తెలుసు

  • ఖైదీలు బయటకు లెటర్ రాయాలి అంటే జైలు సూపరింటెండెంట్ సంతకం ఉండాలి.. దాన్ని మాత్రమే జడ్జ్ స్వీకరిస్తారు

ఆరోగ్యంపై..

  • కళ్ళు ఇబ్బందిగా ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సమాచారం ఇచ్చాం

  • ఆసుపత్రి అధికారులు కంటి వైద్యుడిని పంపి పరీక్షలు చేశారు

  • హెల్త్ రిపోర్ట్స్ తారుమారు అవుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు

  • చంద్రబాబుకు కేటరాక్ట్ ఇన్‌మెట్యూర్‌గా ఉంది

  • జైలులో చంద్రబాబు ఏ బ్లాక్ లో ఉన్నారో ఎవ్వరికీ తెలియదు

  • పోలీసులకు కూడా చంద్రబాబు ఏ బ్లాక్‌లో ఉన్నారో చెప్పం

  • మావోయిస్టుల లేఖ అనేది అబద్దం

  • చంద్రబాబు రాసిన లేఖలు, మావోయిస్టుల లేఖలు అన్ని కూడా కలర్ జిరాక్స్ మాత్రమే

  • చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ అన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాం

1cbn-(1).jpg

Updated Date - 2023-10-27T22:55:29+05:30 IST