Vidadala Rajini: సినిమాల్లోకి వైసీపీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని.. తాజా సమాచారం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-09T19:39:24+05:30 IST

సినిమా రంగంలో ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావ‌టం కొత్తేమీ కాదు. ఎంతో మంది సినిమా న‌టులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు రాజ‌కీయాల్లోకి వచ్చారు. రాణించారు. కానీ... ఇప్పుడు ఓ మంత్రి రాజ‌కీయాల..

Vidadala Rajini: సినిమాల్లోకి వైసీపీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని.. తాజా సమాచారం ఏంటంటే..

సినిమా రంగంలో (Cinema Industry) ఉన్న వారు రాజ‌కీయాల్లోకి రావ‌టం కొత్తేమీ కాదు. ఎంతో మంది సినిమా న‌టులు (Movie Actors), నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు రాజ‌కీయాల్లోకి (Movie Actors Political Entry) వచ్చారు. రాణించారు. కానీ... ఇప్పుడు ఓ మంత్రి రాజ‌కీయాల నుంచి సినిమా (Politics to Cinema) రంగంలోకి వెళ్తున్నారు. అవును... ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (Minister Vidadala Rajini) ఇప్పుడు సినిమా రంగం పై ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే హైద‌రాబాద్ కేంద్రంగా ఓ హైక్లాస్ ఆఫీసును కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా విడ‌ద‌ల ర‌జిని రాజకీయాల్లోకి ఎంట‌ర‌య్యారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంపై గురిపెట్టిన ఆమె 2018లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవ‌ల వైసీపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌లో ఆమెకు మంత్రిగా కూడా అవ‌కాశం ద‌క్కింది.

అయితే, సినిమాలు తీయాల‌న్న ఆస‌క్తితో ఇప్పుడు నిర్మాత‌గా ఆమె కొత్త అవ‌తారం ఎత్తిన‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ ఆఫీసు కేంద్రంగా ఇప్ప‌టికే ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని, తొలి సినిమాకి కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. దర్శకుడు, హీరో ఎవరనే అంశాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రాబోతుండ‌గా, భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఏపీకి చెందిన మ‌రో మంత్రి ఆర్.కే రోజా సినిమా రంగంలో ఉండ‌గా... ఇప్పుడు మంత్రి విడ‌ద‌ల ర‌జనీ కూడా ఎంట‌ర‌య్యారు. అయితే... ఏపీలోనూ ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌న్న చ‌ర్చ సాగుతున్న సంద‌ర్భంలో రాజ‌కీయాల‌ను కాద‌ని, హైదరాబాద్ కేంద్రంగా సినిమా రంగంపై ఫోక‌స్ చేస్తుండ‌టం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌న్న విశ్లేఫ‌ణ‌లు సాగుతున్న నేప‌థ్యంలో విడ‌ద‌ల ర‌జ‌నీ వేస్తున్న అడుగులు దేనికి సంకేత‌మో అర్థం చేసుకోవాలంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-02-09T19:56:10+05:30 IST