BRS First List : ఒకటే జాబితా.. ఒకేసారి 116 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్..!

ABN , First Publish Date - 2023-08-21T13:47:53+05:30 IST

బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు..

BRS First List : ఒకటే జాబితా.. ఒకేసారి 116 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్..!

బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ముందుగా 12:03 నుంచి 12:53 లోపు ప్రకటన చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది కాస్త 01:30 గంటలకు మారింది. చివరాకరికి 02:30 సమయం ఫిక్స్ చేశారని ప్రగతి భవన్ వర్గాలు (Pragathi Bhavan), బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. 02:30 గంటల నుంచి 03:00 గంటలకు వరకు అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. ఇది అధికారికమేనని.. ఇక మార్పులు, చేర్పులు ఏమీ ఉండవని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.


Pragathi-Bhavan.jpg

ప్రగతి భవన్‌కు కేసీఆర్!

కేసీఆర్ మీడియా మీట్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్‌కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే పలువురు సిట్టింగులు, ఆశావహులు వరుసగా భేటీ అయ్యి.. టికెట్లు ఇప్పించాలని కవిత, హరీష్‌లకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ఈ విన్నపాలను కేసీఆర్ ముందు ఆ ఇద్దరూ ఉంచగా.. దానిపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ప్రగతి భవన్ చుట్టూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కచ్చితంగా తమకే టికెట్ వస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. ఆందోళన చెందకుండా శాంతంగా ఉండాలని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. తమ అభిమానులు, అనుచరులకు సూచిస్తున్నారు.

KCR.jpg

సీన్ మారిపోయిందిగా..!

మొదటి జాబితాలో 80 నుంచి 87 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో మొత్తం సీన్ మారిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితా, రెండో జాబితా, మలి జాబితా అని కాకుండా మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఒకేసారి.. ఏకంగా 116 మంది పేర్లను ఒకేసారి ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి గత 2014, 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. ఒకవేళ ఇదే జరిగితే పెను సంచలనమే అనుకోవచ్చు. ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ఇలా ప్రకటన చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేవలం 3 నియోజకవర్గాల్లో పేర్లను పెండింగ్‌లో పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు.. ఉమ్మడి ఖమ్మంలోని రెండు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి అని తెలిసింది. ఈ మూడు వామపక్షాలకు పొత్తులో భాగంగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియవచ్చింది. సమాలోచనలు చేసిన తర్వాత అధికారికంగా ఈ మూడు స్థానాలపై ప్రకటన ఉంటుందని సమాచారం. మరి కేసీఆర్ ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారనేది మరికొద్ది సేపట్లోనే తేలిపోనుంది.

KCR-Final.jpg


ఇవి కూడా చదవండి


BRS MLA Tickets : ప్చ్.. అభ్యర్థుల ప్రకటనకు మళ్లీ టైమ్ మార్చేసిన కేసీఆర్..!


BRS First List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందు కీలక పరిణామం.. నరాలు తెగే ఉత్కంఠ!


BRS First List : ఆ ఒక్కరికి తప్ప.. కాంగ్రెస్‌ నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలందరికీ నో టికెట్..!?


Big Breaking : 10 మంది సిట్టింగ్‌లకు షాకిచ్చేసిన కేసీఆర్.. ఆ నియోజకవర్గాలు ఇవే..


TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?


BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!


Updated Date - 2023-08-21T13:49:10+05:30 IST