Share News

Taiwan: తైవాన్‌లో లక్ష జాబ్స్.. భారతీయులకు మరో అద్భుత అవకాశం!

ABN , First Publish Date - 2023-11-12T20:21:21+05:30 IST

విదేశీ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో భారతీయులకు తైవాన్‌లో భారీ ఎత్తున జాబ్స్ అందుబాటులోకి రావచ్చు.

Taiwan: తైవాన్‌లో లక్ష జాబ్స్.. భారతీయులకు మరో అద్భుత అవకాశం!

ఎన్నారై డెస్క్: విదేశీ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో భారతీయులకు తైవాన్‌లో(Taiwan) భారీ ఎత్తున జాబ్స్ అందుబాటులోకి రావచ్చు. తైవాన్ ప్రభుత్వంతో భారత్(India) జరుపుతున్న చర్చలు ఫలితాన్నిస్తే ఏకంగా లక్ష జాబ్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా ఇరు దేశాల మధ్య ఎంప్లాయ్‌మెంట్ మొబిలిటీ అగ్రిమెంట్(Employment Mobility agreement) కుదిరే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేయచ్చని సమాచారం.

Google: అలర్ట్.. గూగుల్ కీలక నిర్ణయం! మీకు ఒకటికంటే ఎక్కువ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే..

తైవన్‌లోని వివధ రకాల ఫ్యాక్టరీలు, పొలాలు, ఆసుపత్రుల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తైవాన్ జనాభాలో వయసుపైబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, యువతకు ఉపాధి కల్పించేస్థాయిలో భారత ఆర్థికరంగం ఊపందుకోవట్లేదు. 2025 కల్లా తైవాన్ సమాజంలో వృద్ధుల సంఖ్య ఏకంగా 20 శాతానికి చేరుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ఇరు దేశాలకు ఉభయతారకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Viral: అదృష్టం అంటే ఈమెదే! ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడిందో చూస్తే దిమ్మతిరగాల్సిందే!


అయితే, ఈ పరిణామంపై చైనా(China) స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తైవన్ సర్వస్వతంత్రంగా ఉన్నప్పటికీ అది తమ భూభాగమేనని చైవాన్ వాదిస్తోంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఎప్పటినుంచే ఒకే చైనా విధానాన్ని (One China Policy) అమలు చేస్తోంది.

Sugar Vs Jaggery: బెల్లం, చెక్కరా రెండూ చెరకు నుంచే చేస్తారుగా? అయినా చెక్కర కంటే బెల్లం ఎందుకు మెరుగంటే..

కాగా, ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ఈ ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరాయని పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై తైవాన్ నేరుగా స్పందించలేదు కానీ, తమ దేశానికి అవసరమైన ఉద్యోగులు అందించే చర్యలను తామెప్పుడూ స్వాగతిస్తామని పేర్కొంది.

Updated Date - 2023-11-12T20:32:34+05:30 IST