NTR: జర్మనీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-05-23T18:01:40+05:30 IST

ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మే 20 తారీఖున మినీ మహానాడు 2023 వేదికగా వైభవంగా నిర్వహించారు.

NTR: జర్మనీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

జర్మనీలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మే 20 తారీఖున మినీ మహానాడు 2023 వేదికగా జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ వేడుక ద్వారా ఎన్టీఆర్ గొప్పదనాన్ని, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో అయన సాధించిన గొప్ప విజయాలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు.బఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్ జూమ్ మీటింగ్ ద్వారా హాజరై తమ సందేశాన్ని అందించారు. తెలుగు ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని వారివురు కొనియాడారు.

1.jpg

తెలుగుదేశం జర్మనీ అధ్యక్షుడు పవన్ కుర్రా చొరవతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహానాడు కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఏడాది ఎన్నారై టీడీపీ జర్మనీ విభాగం చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. వారికి అనుబంధంగా విద్యార్థి విభాగం (Student Wing), మహిళా విభాగం (Women Wing) లను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం ఉంటుందని ఈ వేడుకకు హాజరైన ఆహ్వానితులతో ప్రతిజ్ఞ చేయించారు. వేడుకకు హాజరైన తెలుగు వాళ్ల కోసం చక్కటి తెలుగు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి కళాకారిణి హరిప్రియ చేసిన నృత్యం, చిన్నారులు శాన్వి, అనన్య పాడిన తెలుగు పాటలు, చిన్నారి నిఖిత చేసిన నృత్యం అందరినీ అలరించాయి. ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన సమన్వయకర్త సుమంత్ కొర్రపాటిని మిగతా కమిటీ సభ్యులైన శివ, నరేష్, వెంకట్, టిట్టు, అనిల్, వంశీ దాసరి, నీలిమ, అఖిల్, సాయిగాపాల్, రాంబాబు, వంశీ ఉండవల్లి, వంశీ నర్రా, మనోజ్, గణేష్, పవన్ అభినందించారు.

Updated Date - 2023-05-23T18:02:54+05:30 IST