NRI: భారత రక్షణమంత్రిత్వశాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు జి. సతీష్ రెడ్డితో డల్లాస్ వాసుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2023-02-06T20:40:24+05:30 IST

మాజీ DRDO ఛైర్మన్, సైంటిస్ట్, ప్రభుత్వ రక్షణ సలహాదారు జి సతీష్ రెడ్డికి ఆయనతో కలిసి చదువుకున్న JNTU మిత్రులు, ఇతర ప్రముఖులు డల్లాస్‌లో "మీట్ అండ్ గ్రీట్ " కార్యక్రమం ఏర్పాటు చేశారు.

NRI: భారత రక్షణమంత్రిత్వశాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు జి. సతీష్ రెడ్డితో డల్లాస్ వాసుల ఆత్మీయ సమ్మేళనం

మాజీ DRDO ఛైర్మన్, సైంటిస్ట్, ప్రభుత్వ రక్షణ సలహాదారు జి. సతీష్ రెడ్డికి ఆయనతో కలిసి చదువుకున్న JNTU మిత్రులు, ఇతర ప్రముఖులు డల్లాస్‌లో "మీట్ అండ్ గ్రీట్ " కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రవాసులు సతీష్ రెడ్డికి అపూర్వ ఆతిథ్యం ఇచ్చారు.

ఈ సందర్భంగా మొదట డల్లాస్‌లోని సతీష్ రెడ్డి మిత్రులు రంగారావు, శ్రీనివాస రాజు, బి. శ్రీనివాసమూర్తి, ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన డీ. శ్రీనివాస మూర్తి, శీనప్ప, శ్రీనివాసులు, రామారావు, రమణారావు, భక్త, రమణ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సతీష్ రెడ్డితో తమ విద్యాభ్యాసం, వారితో వున్న పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

శాస్త్ర విజ్ఞానం పట్ల సతీష్ రెడ్డికున్న మక్కువ, అభిరుచి, అంకిత భావం, పట్టుదల, కృషితో పాటు ఆయన అమూల్యమైన DRDO పరిశోధనలతో పాటు, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి ప్రయాణం చేయడం, తమ మిత్రుడు యువ సైంటిస్ట్ నుంచి సైంటిఫిక్ అడ్వైసర్‌గా(డిఫెన్స్), సెక్రటరీ DR&D, DRDO చైర్మన్‌గా అనేక శాస్త్ర పరిశోధనలకు తుది రూపం ఇవ్వడంతో పాటు, సరికొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టి, గట్టి ప్రణాళికతో వాటిని పరిమిత కాలంలో సాధించడం విశేషమని అన్నారు. తమ మిత్రుడు భారత దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉండటం తమకు గర్వకారణమన్నారు.

3.jpg

ఇతర వక్తలు మాట్లాడుతూ జి. సతీష్ రెడ్డి DRDO ఛైర్మన్‌గా వున్నప్పుడు, కోవిడ్ మహమ్మారి భారత్‌పై విరుచుకు పడినపుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో DRDO కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలెటర్‌లను యుద్ధ ప్రాతిపదికన స్వయంగా ఉత్పత్తి చేయడంతో పాటు, అన్ని సదుపాయాలు గల తాత్కాలిక బెడ్లు శీఘ్రగతిన ఏర్పాటు చేయడం లాంటివి సతీష్ రెడ్డి నాయకత్వ లక్షణాలకు మచ్చు తునకలు అని అన్నారు. శాస్త్ర రంగంలో, పరిశోధనల్లో వరుసగా ప్రఖ్యాత అవార్డులు లైన హోమీ బాబా మెమోరియల్ గోల్డ్ మెడల్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులైన Missile Systems Award, National Design Award, National Aeronautical Prize, National Systems Gold Medalలను పొందారని చెప్పారు .

చివరగా ముఖ్య అతిథి సతీష్ రెడ్డి మాట్లాడుతూ DRDOతో తన పయనం, అబ్దుల్ కలాంతో శిష్యరికం, వారి నుంచి నేర్చుకున్న పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాన్ని త్వరిత గతిన సాధించడం కోసం శ్రమించడం. అహర్నిశలు దేశ అవసరాల కోసం కార్యోన్ముఖులై శాస్త్ర బృందంతో పనిచేయడం లాంటి విషయాల్లో వారి నుంచి ప్రేరణ పొందానని చెప్పారు. భారతదేశం గత ఎనిమిదేళ్ళలో కొత్త పుంతలు తొక్కిందని, శ్తాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రత్యేకించి దేశరక్షణ పరిశోధనా రంగానికి దేశం పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించి లక్ష్యసాధనకు కావలసిన వనరులు సమకూర్చడం వల్ల ముందెన్నడూ లేని విధంగా మన దేశ రక్షణకు అవసరమైన అన్ని రకాల ఆయుధాలు, క్షిపణుల పరిశోధన, తయారీ దేశీయంగానే చేసే మహాక్రతువులో సఫలమైందని, సైనిక తుపాకులు, బాంబులు, అగ్ని-ప్రళయ్-బ్రహ్మోస్ వంటి క్షిపణులు, తేజస్ వంటి యుద్ధ విమానాలు, ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ వంటి యుద్ధనౌకలు, ఒకటేమిటి చిన్న మందుగుండు సామాగ్రి నుంచి భూతల, గగనతల, సముద్ర, అంతరిక్ష సంబంధ ఆయుధ సంపత్తి వరకు నేడు భారత్ దేశీయంగానే తయారుచేస్తూ స్వయంసంవృద్ధి దిశగా దూసుకుపోతుందని, భారత్ తమ స్వీయ అవసరాలకు మాత్రమే కాకుండా రానున్న కాలంలో విదేశాలకు అవసరమైన ఆయుధసంపత్తిని ఎగుమతి చేసే విధంగా తయారు కానుందని, దీనివల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం గౌరవం ఇనుమడించడమే కాకుండా శక్తివంతమైన భారతావనికి విదేశాల మైత్రీసంబందాలు మెరుగవుతాయనీ అన్నారు. ఇంతేకాకుండా నేటి యువతలో పెద్ద మార్పు చూస్తున్నామని, ఐ.ఐ.టి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో నుండి బయటకువస్తున్న విద్యార్థులలో గత ఐదేళ్ళనుండి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య బాగా తగ్గిందని, దీనికి భారత్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ శాస్త్ర సంకేతిక పరిశోధనా పురోగతి, మౌలికవనరులని, దానివల్ల భారత్‌లోనే ఉండి పనిచేయడానికి ఇష్టపడుతున్నారని, దేశ మార్పు కోసం జరుగుతున్న ఈ మహా యజ్ఞంలో ప్రజల స్పందన అద్భుతంగా ఉందని, ప్రవాసులుగా మీ వంతు కృషి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. వారి ప్రతి మాటకు సభికులు కరతాళ ధ్వనులతో పెద్ద ఎత్తున స్పందించారు.

2.jpg

అమెరికాలోని వివిధ తెలుగు అసోసియేషన్స్ అయిన టాంటెక్స్, తానా, నాటా, నాట్స్ ఆటా సంస్థల ప్రతినిధులు జి. సతీష్ రెడ్డికి మొమెంటో బహూకరించి శాలువాలతో, గజమాలతో ఘనంగా సత్కరించారు. నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ మన తెలుగు తేజం సతీష్ రెడ్డి దేశానికి చేసిన సేవలు కొనియాడారు, డల్లాస్‌లో జరిగే నాటా సభలకు ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేయ వలసిందిగా ఆహ్వానం అందించారు.

అదేవిధంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్యారా ఇతర ప్రదేశాల నుండి విలాస్ జంబుల, శ్రీకాంత్ తుమ్మల, సంతోష్ రెడ్డి కోరం, ప్రదీప్ కట్ట బృందం వీక్షించి వారి స్ఫూర్తి దాయక ప్రసంగం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. సభలో NRI ప్రముఖులు చిల్లకూరు గోపి రెడ్డి, అజేయ్ కలువ, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, రామకృష్ణ, ప్రదీప్ రెడ్డి, బలరాం, భీమా పెంటా, భాస్కర్ రెడ్డి, సురేష్ మండువలు పాల్గొన్నారు.

4.jpg

Updated Date - 2023-02-06T20:40:25+05:30 IST