Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా ఎన్నారైలు.. ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
ABN , First Publish Date - 2023-09-17T19:13:58+05:30 IST
స్కిల్ డెవలమెంట్ కేసులో అక్రమంగా అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఎన్నారైలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎన్నారై డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఎన్నారైలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. అమెరికాలోని డాలస్, కనెక్టికట్, వాషింగ్టన్ డీసీ తోపాటూ బెల్జియం, ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా దేశాల్లోని టీడీపీ ఎన్నారై శాఖల సభ్యులు, అభిమానులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు.
సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చి హైదరాబాదును సాఫ్ట్‌వేర్‌ను హబ్‌గా మార్చిన విజినరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని అమెరికాలోని ఎన్నారైలు కొనియాడారు. టీడీపీ అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా ఫిలడెల్ఫియాలో తెలుగు అసోసియేషన్ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఫ్రెస్కోలో ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు.
NRI TDP Belgium ఆధ్వర్యంలో ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా "మేము సైతం బాబు గారికి తోడుగా" కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని అటోమియం ముందు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు కలిసి చేద్దామని పేర్కొన్నారు.
దుబాయ్‌లో కూడా ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. టీడీపీ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో పార్టీ అధినేతకు మద్దతుగా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం Jebel Ali Hindu Temple ప్రాంగణంలో జరిగింది. NRI తెలుగుదేశం Dubai సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరులు దీక్షలో పాల్గొన్నారు. సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికాలో ఎన్నారై టీడీపీ శాఖ ఆధ్వర్యంలో అక్కడి తెలుగువారు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. Midrand లోని 8 Lourens Street, Halfway House ప్రాంగణంలో టీడీపీ అధినేతకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో NRI తెలుగుదేశం South Africa సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.