ATA: ఆటా నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మధు బొమ్మినేని

ABN , First Publish Date - 2023-01-24T22:59:58+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు.

ATA: ఆటా నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మధు బొమ్మినేని

ఆటా బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 2023-2024

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని (Madhu Bommineni) బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్ లోని దిమ్మరాగ్‌లో శనివారం జరిగిన ఆటా బోర్డు సమావేశంలో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్‌లోని అన్ని ప్రాంతాల నుంచి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుంచి 'ఆటా'లో చురుగ్గా ఉండడంతోపాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు.

ATA-1.jpg

2023 జనవరిలో ఆటాలోని 16 బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన సభ్యులు 4 సంవత్సరాలపాటు పదవిలో కొనసాగనున్నారు. అనిల్ బొద్దిరెడ్డి, సన్నీరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘువీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయంత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది.

ATA-2.jpg

ఆటా బోర్డు 2023, 2024 టర్మ్‌కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు

రామకృష్ణారెడ్డి అల, (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి (జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్) హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా ఎన్నికయ్యారు.

ATA-3.jpg

భవిష్యత్ లక్ష్యాలు, ఆటా రోడ్ మ్యాప్ వివరాలను నూతన అధ్యక్షురాలు మధు బొమ్మినేని వెల్లడించారు. ఆటా సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యతతో సమాజ సేవలో ముందుండాలని తెలిపారు. అక్షరాస్యత, సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సాహించాలనే ప్రాథమిక లక్ష్యాలకు ఆటా కట్టుబడి ఉంటుందని, యువతరాన్ని భాగస్వామ్యం చేయడం, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆటా కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని పెంచడం, ATA SEVA అవసరమైన వనరులతో మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలు కల్పించడం, విద్యార్థి సేవలతోపాటు, సమాచార మరియు ఆరోగ్య సేవల కార్యక్రమాలకు తన పదవీ కాలంలో మరింత ప్రాధాన్యతనిస్తామని ఆమె పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా 'ఆటా'కు సేవలందించిన అధ్యక్షులు భువనేశ్ భూజాల మరియు సభ్యులను మధు బొమ్మినేని అభినందించారు.

Updated Date - 2023-01-24T23:09:59+05:30 IST