NRI: విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8343 మంది భారతీయులు..!

ABN , First Publish Date - 2023-02-05T21:50:10+05:30 IST

విదేశీ జైళ్లల్లో మొత్తం 8343 మంది భారతీయ ఖైదీలున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు.

NRI: విదేశీ జైళ్లలో మగ్గుతున్న 8343 మంది భారతీయులు..!

ఎన్నారై డెస్క్: విదేశీ జైళ్లల్లో మొత్తం 8343 మంది భారతీయ ఖైదీలున్నారని(Indian Prisoners in Foreign Jails) విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్(V.Muraleedharan) శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. వీరిలో విచారణ ఎదుర్కొంటున్న అండర్‌ట్రైల్ ఖైదీలు కూడా ఉన్నారన్నారు. విదేశాల్లోని భారతీయ ఖైదీల భద్రతకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. యూఏఈలో(UAE) అత్యధికంగా 1929 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. సౌదీ అరేబియా(Saudi Arabia) జైళ్లల్లో 1362 మంది మగ్గుతున్నారు. నేపాల్‌లో(Nepal) 1222 మంది భారతీయ ఖైదీలున్నారు. ఇక.. విదేశాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని స్వదేశానికి తరలించేందుకు 31 దేశాలతో భారత్ ఒప్పందాలను చేసుకుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-05T23:51:26+05:30 IST