సమంత ఫ్యాన్స్‌... ‘ఖుషి’

ABN , First Publish Date - 2023-07-30T02:27:08+05:30 IST

సమంత అనారోగ్యం, సినిమాల నుంచి విరామం తీసుకోవడం ఆమె అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన విషయాలు. సమంత మళ్లీ నటిస్తుందా? ఇది వరకటిలా జోష్‌ చూపించగలదా? అనే అనుమానాలూ వాళ్లలో వ్యక్తం అవుతున్నాయి.

సమంత ఫ్యాన్స్‌... ‘ఖుషి’

సమంత(Samantha) అనారోగ్యం, సినిమాల నుంచి విరామం తీసుకోవడం ఆమె అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన విషయాలు. సమంత మళ్లీ నటిస్తుందా? ఇది వరకటిలా జోష్‌ చూపించగలదా? అనే అనుమానాలూ వాళ్లలో వ్యక్తం అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ ‘ఖుషి’ ప్రచార చిత్రాలు సమాధానంగా నిలుస్తున్నాయి. విజయ్‌ దేవరకొండతో సమంత కలిసి నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ కూడా పూర్తయింది. ‘ఖుషి’ ముగిసిన తరవాతే.. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, విదేశాలకు వెళ్లిపోయింది సమంత. ఆ తరవాత ‘ఖుషి’ నుంచి ఒక్కో పాట బయటకు రావడం మొదలైంది. ఆ పాటల్లో సమంత లుక్స్‌, స్టైల్‌ ఆమె అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. ‘శాకుంతలం’లో సమంత ఏమంత గ్లామర్‌గా కనిపించలేదు. ఆమెలోని ఛార్మ్‌ ఏమైపోయిందంటూ అందరూ బెంగ పడ్డారు. ఇప్పుడు మళ్లీ ‘ఖుషి’లో ఆ వెలుగు కనిపిస్తోంది. పైగా పాటలూ ఆకట్టుకొంటున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సమంత అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు చిత్రీకరించిన గీతాలివి. అయినా ఆ మెరుపులేం తగ్గలేదు. కొంత విశ్రాంతి తీసుకొంటే, అనారోగ్యం నుంచి కోలుకొంటే.. ఇది వరకటి సమంతని కచ్చితంగా చూడగలం అని అమె అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

Updated Date - 2023-07-30T02:27:08+05:30 IST