Sun: కోడికోసం సూర్యుడు

ABN , First Publish Date - 2023-03-09T22:34:13+05:30 IST

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంది. ఆ ఉక్కపోత తట్టుకోలేక జీవులన్నీ విలవిలలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సూర్యుడిని తిట్టుకుంటున్నారు. కనికరమే లేదా అని చెత్తగా మాట్లాడుతున్నారు.

Sun: కోడికోసం సూర్యుడు

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంది. ఆ ఉక్కపోత తట్టుకోలేక జీవులన్నీ విలవిలలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సూర్యుడిని తిట్టుకుంటున్నారు. కనికరమే లేదా అని చెత్తగా మాట్లాడుతున్నారు. ఇది విని సూర్యుడు కోప్పడ్డాడు. తిట్టినవాళ్లకు బుద్ధి చెప్పినట్లవుతుందని తనకు తానే చీకట్లోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. దీంతో లోకమంతా చల్లగా ఉంది. వెలుతురు రాలేదు. ఒక్కసారిగా జనాలంతా చీకటి, చల్లదనంకు అలవాటుపడలేక సూర్యుడే కావాలని వేడుకున్నారు. ప్రతి ఒక్కరూ సూర్యుడిని రమ్మని ప్రార్థించారు. సూర్యుడి మనసు కరగలేదు.

ఒకరోజు పక్షులన్నీ కూర్చుని మాట్లాడుకున్నాయి. వారి చర్చల్లో కోడితో రాయబారం పంపితే సూర్యుడు కనికరిస్తాడని తేలింది. దీంతో కోడిని సూర్యుడి దగ్గరకు వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లి దయచేసి మళ్లీ బయటకు వస్తే మేం బావుంటామని చెప్పమన్నారు. ప్రాథేయపడమన్నారు.

మరుసటి రోజు సూర్యుడి దగ్గరకు వెళ్లి మళ్లీ ఆకాశంలోకి రమ్మని బతిమిలాడింది. ఆకాశంలోకి వచ్చే ప్రసక్తేలేదని సూర్యుడన్నాడు. ‘అయితే నేను వెనక్కి వెళ్లలేను. వెళ్తే అడవిలో పిల్లి కాచుకుని ఉంది. ఎప్పుడెప్పుడా’ అని అన్నది. ‘నీకు అవసరమొస్తే, ఆపదొస్తే పిలువు. వస్తా’ అన్నాడు సూర్యుడు. కోడి బయలుదేరింది. కొంచెం దూరం వెళ్లాక కాపాడమని గట్టిగా అరిచింది. నామీద దాడి చేస్తున్నారని అరిచింది. సూర్యుడు బయటకు వచ్చాడు. కోడిని కాపాడాలని ఆకాశలోంకి వచ్చాడు. ఆ వెలుతురులోంచి కోడిని వెతికాడు. చెట్టుచాటున కోడి దాక్కుంది. సూర్యుడికి కనపడలేదు.

అప్పటినుంచి కోడిని వెతికినా సూర్యుడు కనపడటం లేదు. ఇప్పటి వరకూ ప్రతి రోజు కోడి కూసినవెంటనే సూర్యోదయం వస్తోంది. అయితే ఇప్పటికీ కోడి ఎక్కడ ఉందో సూర్యుడు కనిపెట్టలేకపోయాడు. అయితే లోకానికి మంచి జరిగింది.

Updated Date - 2023-03-09T23:07:09+05:30 IST