మంద బుద్ధి దొంగ!

ABN , First Publish Date - 2023-01-21T23:21:47+05:30 IST

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక పెద్ద ఉత్సవానికి వెళ్తున్నాడొక రోజు. అతడి దుస్తులు, చేతిలోని సూటు కేసు చేతిలో ఉంది. అందులో డబ్బులున్నవి. ధనవంతుడు వాలకాన్ని చూసి ఇతన్ని బురిడీ కొట్టించి డబ్బులు కాజేయాలని మనసులో అనుకున్నాడు.

మంద బుద్ధి దొంగ!

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక పెద్ద ఉత్సవానికి వెళ్తున్నాడొక రోజు. అతడి దుస్తులు, చేతిలోని సూటు కేసు చేతిలో ఉంది. అందులో డబ్బులున్నవి. ధనవంతుడు వాలకాన్ని చూసి ఇతన్ని బురిడీ కొట్టించి డబ్బులు కాజేయాలని మనసులో అనుకున్నాడు.

అయినా ఈ ధనవంతులకు బుద్ధి తక్కువ ఉంటుందని తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చాడు.

ధనవంతుడు నడుచుకుంటూ వెళ్తుంటే.. ఏమీ తెలియనట్లు దొంగ వెనకాల నడిచాడు. పరిచయం చేసుకున్నాడు. ధనవంతుడు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి ఒక సత్రం దగ్గర ఆగాడు ధనవంతుడు. దొంగ కూడా అక్కడే ఆగాడు. ఆ తర్వాత దొంగతో కాస్త మాట్లాడాడు. భోజనం చేసే సమయంలో ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. సాయంత్రమయ్యింది. ఆ తర్వాత రాత్రయింది. పడుకునే సమయంలో డబ్బులు తీసుకుపోవాలనే ఆలోచన దొంగది. ధనవంతుడు కొద్ది సేపయ్యాక నిద్ర పోయాడు. అంతలోనే అది గమనించి దొంగ మెల్లగా ధనవంతుడు దగ్గరకు వచ్చి సూట్‌ కేసు తీసుకున్నాడు. దూరంగా వెళ్లి తన ప్రతిభతో సూటుకేసు తెరిచాడు. అంతే అందులో పూలున్నాయి. అది చూసి దొంగ కంగుతిన్నాడు. మళ్లీ మెల్లగా వచ్చి ధనవంతుడి సూట్‌కేసునే పక్కనే పెట్టాడు.

ఉదయం నిద్ర లేస్తూనే ధనవంతుడు ఎదురుగా ఉండే దొంగను చూశాడు. అయ్యా.. నేను దొంగవాన్ని. మీ డబ్బులు దొంగలించాలని వచ్చా. మీ డబ్బు మాత్రం కనపడలేదు. అదేంటో మాయగా ఉంది.. డబ్బులు కనపడేలేదే అన్నాడు. అది విన్న ధనవంతుడు ‘నాకు తెలుసు. నేను ఎవరినీ నమ్మను. నువ్వు దొంగ అయి ఉంటావనుకున్నా’ అన్నాడు. దొంగ ఆశ్చర్యపడ్డాడు. మరి డబ్బులేవి? అంటూ ఆశ్చర్యపోయాడు. ‘నా డబ్బు పోకుండా తెల్లవార్లు నువ్వే కళ్లు కాయలు కాసేలా కాపు కాసావు’ అన్నాడు. దొంగకు అర్థం కాలేదు. అటూ.. ఇటూ చూశాడు. ఇదిగో ‘నీ దిండు కింద ఉన్నాయి కదా’ అంటూ డబ్బులను చూపించాడు ధనవంతుడు. ‘ఇదెట్లా మర్చిపోయానబ్బా?’ అనుకుంటూ తల గీరుకున్నాడు దొంగ. ‘నువ్వు నా దగ్గర ఉండే సూట్‌ కేసును చూశావు. అందులో డబ్బుందని భావించావు. నీ దిండుకింద డబ్బులు ఉన్నాయని తెలుసుకోలేకపోయావు’ అంటూ నవ్వాడు ధనవంతుడు. దొంగ సిగ్గుతో తలవంచుకున్నాడు. కొంత డబ్బులు ఇచ్చి.. ఏదైనా పని చేసుకో అన్నాడు ధనవంతుడు. తన మందబుద్ధికి తానే తిట్టుకుంటూ దొంగ వెళ్లిపోయాడు.

Updated Date - 2023-01-21T23:21:47+05:30 IST