Friendship:చెడ్డవారితో స్నేహం

ABN , First Publish Date - 2023-03-18T23:52:22+05:30 IST

ఒక ఊరి చివరలో కాకుల గుంపు ఉండేది. అది వందల కాకుల గుంపు. ఆ గుంపును ఒక కాకి రాజు చూసుకునేవాడు. ఆ రాజుకాకి ఎటెళ్లితే..

Friendship:చెడ్డవారితో స్నేహం

ఒక ఊరి చివరలో కాకుల గుంపు ఉండేది. అది వందల కాకుల గుంపు. ఆ గుంపును ఒక కాకి రాజు చూసుకునేవాడు. ఆ రాజుకాకి ఎటెళ్లితే.. మిగతావి అనుసరించేవి. ఎక్కడికి వెళ్లినా గుంపు బయలుదేరేది. ఆ కాకుల బెడద తట్టుకోలేక చాలామంది రైతులు భయపడేవాళ్లు.

ఆ ఊరిలో ఒక పిసినారి రైతు ఉండేవాడు. అతని పొలాన్ని ఒక రోజు కాకుల గుంపు ముట్టడించింది. జొన్న పంటను నాశనం చేశాయి. అది చూసి ఆ రైతు బాధపడ్డాడు. ఎలాగైనా సరే ఏదోటి చేసి కాకుల గుంపును అంతమొందించాలనుకున్నాడు. చేలో ధాన్యం కుప్ప వేసి దాని చుట్టూ వలను ఉంచాడు. ఎప్పటిలాగే ఆ కాకుల గుంపు చేలోని ధాన్యాన్ని చూసి వేగంగా, అరుస్తూ చేలో వాలాయి. సెకన్లలో వలలో చిక్కుకున్నాయి కాకులు. ఒకట్రెండు మాత్రమే తప్పించుకున్నాడు. ఆ వలలో అప్పటిదాకా ధాన్యం తింటూ ఉండే ఓ తెల్లపావురం కూడా వలలో చిక్కుకుంది.

ఆ తెల్ల పావురం గట్టిగా అరిచింది. ఆ రైతు చూసి జాలిపడ్డాడు. నల్లకాకుల మధ్య తెల్ల పావురమేంటీ? అని విచిత్రంగా చూశాడు. దగ్గరికెళ్లి పావురాన్ని చేత్తో పట్టుకున్నాడు. ‘ఈ చెడు లక్షణాలుండే వాళ్లతో ఎందుకు వచ్చావు. వెళ్లిపో’ అంటూ పైకి ఎగరేశాడు. పావురం ఆనందంతో ఎగిరిపోయింది. ఆ రైతు పొలంలో ఉండే ఐదు పెంపుడు కుక్కలు వచ్చి ఆ కాకులను వల తీయకుండానే చంపేశాయి.

నీతి: చెడువారితో సావాసం ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-18T23:52:22+05:30 IST