మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-04-12T00:16:07+05:30 IST

శరీరం అంతా ఆకుపచ్చ రంగుంలో ఉండి.. దాని ఒంటి మీద నారింజ గీతలు గీసినట్లుండే ఈ అందమైన చేప పేరు..

మీకు తెలుసా?

రీరం అంతా ఆకుపచ్చ రంగుంలో ఉండి.. దాని ఒంటి మీద నారింజ గీతలు గీసినట్లుండే ఈ అందమైన చేప పేరు.. ‘ఆరెంజ్‌ లైన్డ్‌ ట్రిగర్‌ ఫిష్‌’. సముద్రంలోపల ఉండే అందమైన జీవుల్లో ఈ చేప కూడా ఒకటి. వీటి కళు పైభాగంలో చిన్నగా ఉంటాయి, వీటి రెక్కల్లాంటి నిర్మాణాలు, తోక చూస్తే ఇదేదో డెకరేటివ్‌ పీస్‌ అని భ్రమపడి పోయే అవకాశం ఉంది.

చిన్న నోరు ఉండే ఈ జీవి గట్టిగా కొరుకుతుంది. వీటి పళ్లు పదునుగా ఉంటాయి. ఇక వీటిల్లో మూడు వెన్నెముకల్లాంటి నిర్మాణముంటుంది.

ఇవి అధికంగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇసుకలో చిన్న గూళ్ల లాంటి నిర్మాణం చేసుకుని గుడ్లు పెడతాయి. ఈ సమయంలో ఇవి అగ్రెసివ్‌గా ఉంటాయి. ఇతర జీవుల మీదకు కొరకటానికి వెళ్తాయి.

ఇవి 30 సెం.మీ పొడవు పెరుగుతాయి. 50 మీ లోతులో ఎక్కువగా ఉంటాయి.

ఎవరైనా నీటిలో డైవ్‌ చేస్తుంటే.. ఇది కదలకుండా దాక్కుండిపోతుంది. వాస్తవానికి ఇవి షై ఫిష్‌లు.

సముద్రంలోని పాచి, చిన్న జీవులు, గుడ్లు చిన్న చేపలను తిని బతుకుతాయివి.

ఇవి అందంగా ఉన్నా ఆక్వేరియంలో పెంచుకోరు. ఎందుకంటే ఇవి కరుస్తాయి. పైగా ఆక్వేరియంలోని చిన్న చేపలను తినేస్తాయి.

ఇవి ఐదునుంచి పదేళ్ల పాటు జీవిస్తాయి.

Updated Date - 2023-04-12T00:17:12+05:30 IST